Turmeric Tips : ముఖానికి పసుపు రాసుకుంటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..

పెళ్లిళ్ల సమయంలో, పుష్పవతి అయినప్పుడు, ఒడిబియ్యం లాంటివి పోసినప్పుడు స్త్రీలకు ఈ పసుపును (Turmeric) ముఖానికి కాళ్లకు బాగా అప్లై చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 01:00 PM IST

Tips for using Turmeric : మామూలుగా స్త్రీలు ముఖానికి కాళ్లకు చేతులకు పసుపు రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో, పుష్పవతి అయినప్పుడు, ఒడిబియ్యం లాంటివి పోసినప్పుడు స్త్రీలకు ఈ పసుపును (Turmeric) ముఖానికి కాళ్లకు బాగా అప్లై చేస్తూ ఉంటారు. అయితే కేవలం ఈ సందర్భాలలో మాత్రమే కాకుండా కొందరు స్త్రీలు మామూలుగా కూడా ముఖం బాగా గ్లో రావడం కోసం పసుపుని (Turmeric) ఎక్కువగా ముఖానికి పట్టిస్తూ ఉంటారు. మెరిసే చర్మం కోసం శనగపిండి, పసుపు, పెరుగు లాంటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వంటివి చేస్తారు. పసుపు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇది మంచి యాంటీ బయాటిక్ గా మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా బాగా పని చేస్తుంది. పసుపు వంటలలో వేసుకునేందుకే కాకుండా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ముఖానికి పసుపు రాసుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించడం తప్పనిసరి. అయితే పసుపు ముఖానికి రాసుకునే ముందు కొన్ని చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి అందాన్ని ఇవ్వక పోగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. చాలా వరకు పసుపుతో రోజ్ వాటర్, పాలు, నీళ్ళు కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటారు. అనవసమైన పదార్థాలని పసుపుతో జోడించి రాసుకోవడం వల్ల అది చర్మానికి హాని కలిగిస్తుంది. మనం పసుపు పట్టుకుంటేనే చేతులు పసుపు రంగులో కనిపిస్తాయి.

ఇక ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఫేస్ ప్యాక్ లు వేసుకున్నప్పుడు దాన్ని 20 నిమిషాలకి మించి ఉంచుకోకూడదు. అందుకు పసుపు ఏమి మినహాయింపు కాదు. పసుపుతో ప్యాక్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు దాన్ని ముఖంపై ఉంచుకుంటే ముఖమంతా పచ్చగా మచ్చలు కనిపిస్తాయి. అంతే కాదు మోతాదుకు మించి పసుపు రాసుకోవడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. పసుపు రాసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చల్లటి నీటితో ఫేస్ కడగాలి. పసుపు రాసుకున్న తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే సబ్బు వాడటం. అది అస్సలు చెయ్యకూడదు. పసుపుతో ప్యాక్ వేసుకున్న తర్వాత సబ్బు ఉపయోగించకూడదు. 24 లేదా 48 గంటల తర్వాత మాత్రమే ముఖాన్ని సబ్బుతో కడగాలి. తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. పసుపు ప్యాక్ వేసుకున్న సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖానికి మాత్రమే వేసుకుని మిగతా ప్రదేశాన్ని వదిలి పెట్టడం వల్ల చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ప్యాక్ వేసిన ప్రదేశం పసుపుగా ఉంది మిగతా ప్రదేశం నార్మల్ గా ఉంటే చూసేందుకు బాగోదు. అందుకని పసుపుతో ప్యాక్ వేసుకునేటప్పుడు కచ్చితంగా మెడ మీద రాసుకోవాలి.

Also Read:  Caffeine: కాఫీ ప్రియులరా జాగ్రత్త..! ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ఎంతో హాని..!