వర్షాకాలానికి (Rainy Season) మరో పేరు ఉందని మీకు తెలుసా..? అవును వర్షాకాలాన్ని రొమాంటిక్ సీజన్ (Romantic Season) అని కూడా పిలుస్తుంటారు. వర్షపు చినుకులు పడుతుంటే ప్రేమికుల మధ్య బంధం మరింత గాఢమవుతుంది. చిన్నపాటి గొడుగు కింద ఇద్దరూ కలసి నడవడం, ఒకరి చేతిలో మరొకరి చేయి వేయడం, వంటివి చేస్తూ వారిలో ప్రేమను మరింత బలపరుస్తుంటారు. చినుకుల శబ్దం, చల్లని గాలి ప్రేమికుల మనసులను తాకుతూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇది కేవలం భావోద్వేగమే కాకుండా, దానికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
Kerala : కన్నబిడ్డలను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కసాయి తల్లి
వర్షపు చినుకుల శబ్దాన్ని శాస్త్రవేత్తలు “పింక్ నాయిస్”గా పిలుస్తారు. ఇది మెదడును రిలాక్స్ చేసి, మనస్సును ప్రశాంతంగా మార్చుతుంది. అదే సమయంలో మట్టి వాసన, చినుకుల తాకిడితో చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ప్రేమ క్షణాల వరకు ఎన్నో భావోద్వేగాలను రెప్పపాటులో గుర్తుకు తెస్తుంది. దీన్ని ‘రిమినిసెన్సె బంప్’ అంటారు. వానలో తడవడం ద్వారా పాత జ్ఞాపకాలు, అనుబంధాలు, అనుభూతులు మళ్లీ మానసికంగా స్పష్టంగా బయటపడతాయి. ప్రేమికుల మధ్య ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుతుంది.
ఇక హార్మోన్ల విషయానికి వస్తే.. వర్షాకాలంలో మెలటోనిన్, ఆక్సిటాసిన్ వంటి హార్మోన్ల ప్రభావంతో శరీరం మరియు మనస్సు మరింత ప్రశాంతంగా మారుతాయి. స్ట్రెస్‌ను పెంచే కార్టిసాల్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల వ్యక్తి మూడ్ సానుకూలంగా మారుతుంది. ఫలితంగా ప్రేమికులు ఒకరిపై మరొకరికి మరింత సమీపంగా మమేకమవుతారు. ఎమోషనల్ బాండింగ్, ఫిజికల్ ఇంటిమసీ కూడా ఈ కాలంలో ఎక్కువగా పెరుగుతాయి. వర్షం కేవలం ప్రకృతి దృశ్యం మాత్రమే కాకుండా, ప్రేమికుల మనసుల్లో మధుర జ్ఞాపకాల్ని జాగృతం చేసే అద్భుతమైన మాయగా నిలుస్తుంది.