Anemia: “రక్తహీనత” గండం.. పురుషులు, స్త్రీలపై ఎఫెక్ట్ ఇలా

రక్తహీనత అనే సమస్య మన దేశంలో ఎంతోమందిని వేధిస్తోంది (Harassing). పురుషులలో 25%, మహిళల్లో 57%,

రక్తహీనత (Anemia) అనే సమస్య మన దేశంలో ఎంతోమందిని వేధిస్తోంది. పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. రక్తహీనత అంటే శరీరంలో రక్తం తక్కువగా ఉండటం. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. అందుకే 2047 కల్లా దేశంలో రక్తహీనత సమస్యను నివారించాలనే టార్గెట్ పెట్టుకున్నామని ఈసారి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. రక్తహీనత (Anemia) ముఖ్యంగా పౌష్టికాహార లోపం, రక్తం నష్టపోవడం, రక్తం తయారీలో అవరోధం అనే 3 కారణాల వల్ల వస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసే రక్తంలోని ఎర్రరక్త కణాలలో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి?

ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే తలసేమియా వ్యాధి. ముఖ్యంగా ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత. అయితే ఈ వ్యాధికి చికిత్స లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యతో ఎక్కువగా గిరిజనులు బాధపడుతుంటారు. ఈ ఇన్ ఫెక్షన్ వస్తే ఎర్ర రక్త కణాలను రౌండ్ ఫ్లెక్సిబుల్ డిస్క్ ల నుంచి గట్టిగా, జిగటుగా కొడవలి ఆకారంలోని కణాలలాగా మారుస్తుంది. దీనివల్ల శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉండవు. ఈ ఇన్ ఫెక్షన్ వచ్చిన వ్యక్తి రక్త హీనతతో బాధపడతాడు. శరీరంలోని కణజాలాలకు తగినంత ఆక్సిజన్ తీసుకెళ్లలేనప్పుడు ఈ పరిస్థితి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సికిల్ సెల్ ఎనీమియా వచ్చిన వారు చిన్న పనులకే అలసిపోవడం, కాళ్లు, చేతుల వాపు, కామెర్లు వంటి వ్యాధులతో తరచూ బాధపడుతుంటారు.

సికిల్ సెల్ ఎనీమియా లక్షణాలు

  1. ఈ వ్యాధి ప్రధాన లక్షణం రక్త హీనత.
  2. ముఖ్యంగా శరీరంలో ఎర్ర రక్త కణాలు 10 నుంచి 20 రోజుల్లో చనిపోతాయి. తిరిగి శరీరం రక్త కణాలను వృద్ధి చేయడానికి 120 రోజులు పడుతుంది. దీంతో రక్త హీనతకు గురవుతారు.
  3. ఛాతీ, పొత్తికడుపు, కీళ్లల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది.
  4. శరీరం రోగ నిరోధక శక్తి కోల్పోతుంది. దీంతో అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
  5. ముఖ్యంగా ఈ వ్యాధి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో ఎదుగుదల సవ్యంగా జరగదు. ఒక్కోసారి త్వరగా యుక్త వయస్సుకు వచ్చేయవచ్చు.
  6. కడుపులో ఏదైనా అల్సర్ లేక క్యాన్సర్ ఉండడం వల్ల కూడా నెమ్మదిగా బాడీలో రక్తం తగ్గిపోతుంది.
  7. విటమిన్ బీ12 లోపం, బీపీ, షుగర్, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా రక్తహీనత వచ్చే అవకాశముంటుంది.

మహిళలపై ఈ ప్రభావాలు

  1. రక్త హీనత ఉన్న మహిళలు గర్భం దాల్చినపుడు బిడ్డ తక్కువ బరువుతో పుడుతుంది.
  2. కాన్పు తర్వాత నీరసంగా అయ్యి ఇబ్బంది పడుతుంటారు. చాలా సార్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది.
  3. ఒకసారి ఎక్కించిన రక్తం 4 నెలలు మాత్రమే శరీరంలో ఉంటుంది. ఆ లోపు బాడీలో రక్త కణాల ఉత్పత్తి మెరుగు పడేలా చేయగలగాలి. లేదంటే తరుచూ రక్తం ఎక్కించే అవసరం వస్తుంది. ఆ పైన దాని వల్ల అనేక ఇతర ఇబ్బందులు కలుగుతాయి.
  4. మహిళల్లో నెలసరిలో ఎక్కువ రక్త స్రావం అవ్వడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.
  5. థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్య వల్ల లేదా గర్భసంచిలో గడ్డలు (fibroids) వంటి ఇతర సమస్యల వల్ల కూడా రక్తహీనత రావచ్చు.

సికిల్ సెల్ ఎనీమియా చికిత్స

ఈ సికిల్ సెల్ ఎనీమియాకు చికిత్స లేదు. అయితే స్టెమ్ సెల్, బోన్ మేరో చికిత్సలతో వ్యాధిని నయం చేసే అవకాశం ఉంది. కానీ ఈ చికిత్స చాలా రిస్క్ తో కూడుకున్నదని నిపుణుల అభిప్రాయం.

రక్తహీనత (Anemia) అపోహలు.. వాస్తవాలు

Anemia ఉన్నవారు సరిగ్గా తినరు అని అందరూ భావిస్తారు. వాస్తవానికి రక్త హీనత వల్ల ఆకలి ఉండదు..కాబట్టి తినరు. బియ్యం తినడం, బల్పాలు తినడం, చాక్ పీసులు తినడం వల్ల బాడీలో రక్తం తగ్గిపోతుందని అంటుంటారు. వాస్తవానికి రక్త హీనత వల్ల అలాంటివి తినాలని అనిపిస్తుంది.

మగవారికీ ముప్పు

ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు దాటిన మగవారిలో రక్తహీనతకు గల ఒక ముఖ్య కారణం.. కడుపులో క్యాన్సర్. ఎండోస్కోపీ, అవసరమైతే కొలనోస్కోపీ ద్వారా దీన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల, కాలేయం పాడయిన వారికి, కడుపులో రక్తనాళాలు ఉబ్బిపోయి ఉంటాయి. అవి చిట్లినట్టయిటే ఒక్క సారిగా రక్త స్రావం అయ్యి రక్తం వాంతులు అయ్యే అవకాశం ఉంది.

Also Read:  WhatsApp Stickers: వాలెంటైన్స్ డే కోసం వాట్సాప్ లో ప్రత్యేక స్టిక్కర్లు..!