భారతీయ దిగ్గజం ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్న విషయం తెలిసిందే. ముకేశ్, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా (Radhika Merchant) మర్చంట్ అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అందానికి అందం, హోదాకు హోదా రాధిక సొంతం. అయితే ఇటీవల రాధిక మార్చంట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అవుతున్నాయి. తాజాగా ఆమె ఎప్పుడూ కనిపించని దుస్తుల్లో కనిపించడంతో ఇంటర్నెట్‌లో రాధిక ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.
ఫోటోలు రాధిక పూల కార్సెట్ టాప్, స్కర్ట్ లో జిగేల్ మంటూ అచ్చం బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ లా మెరిసిపోయింది. పూలతో కూడిన కార్సెట్ టాప్, స్కర్ట్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు ఇన్ స్టాలో పోస్ట్ అయ్యాయి. రాధిక ధరించిన పూల ప్రింటెడ్ కార్సెట్ బ్లౌజ్, మ్యాచింగ్ స్కర్ట్ డ్రస్సుకు ఫ్యాషన్ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రాధిక ఫొటోలు (Unseen Pics) వైరల్ కావడంతో అంబానీ కోడలు అదర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
రాధికా మర్చంట్ ఎవరో తెలుసా? ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి అత్యంత సన్నిహితుడు, వీరెన్ మర్చంట్- షైలా మర్చంట్ ఏకైక కుమార్తె. ఎన్‌కేర్ హెల్త్‌కేర్ సీఈఓగా ఉన్నారు రాధికా. భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లోనూ వీరెన్ మర్చంట్ ఒకరిగా ఉన్నారు. రాధికా మర్చంట్, అనంత్ అంబానీకి ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు (Friends) గా ఉన్నారు. రాధికా మర్చంట్‌కు సంప్రదాయ నృత్యం భరతనాట్యంలో ప్రావీణ్యం కూడా ఉంది. ఈమె ఇటీవల ఇందులో అరంగేట్రం చేశారు.
Also Read: Biker Video: వాట్ ఏ డ్రైవింగ్ గురూ.. నదిలో బైక్ డ్రైవింగ్, చక్కర్లు కొడుతున్న వీడియో!