Site icon HashtagU Telugu

Weight Loss: వాము, జీలకర్ర టీ తాగితే మీ శరీరంలో ఈ మార్పులు గ్యారెంటీ?

Cumin Tea Benefits

Azwani Jeera Tea

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు కారణంగా చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం రకరకాల టిప్స్ ను పాటిస్తూ ఉంటారు. జిమ్ కు వెళ్లి బరువు తగ్గాలి అనుకుంటారు. కానీ రెండు మూడు రోజుల్లోనే బాడీ పెయిన్స్ వల్ల దాన్ని కూడా మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఇలా బరువు ఉన్నవారు ఏ ఒక్క పనిని సరిగ్గా చేయకపోవడంతో ఆ విషయం గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఇటువంటి క్రమంలోనే చాలామంది అనేక రకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారికోసం ఒక టీ చక్కగా పనిచేస్తుంది.

వాము జీలకర్రతో చేసిన టీ ని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే వాము,జీలకర్ర బరువులు తగ్గించడంతోపాటుగా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాము, జీల‌క‌ర్ర పొడిని మూడు నెల‌ల పాటు ప్ర‌తిరోజు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష‌ప‌దార్థాలు మ‌ల‌, మూత్ర‌, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కొచ్చేస్తాయి. అదేవిధంగా అద‌న‌పు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరం పై ఉన్న ముడ‌త‌లు పోయి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.ఈ వాము, జీలకర్ర టీ ని తాగడం వల్ల ఎముక‌లు బ‌లంగా తయార‌వుతాయి. అంతేకాకుండా కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
అలాగే ఈ టీ నీ తాగడం వల్ల కంటి చూపు మెరుగ‌వుతుంది.

ప‌ళ్లు, చిగుళ్లు బ‌లంగా ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. అయితే గ‌తంలో తీసుకున్న ఆల్లోప‌తీ మందుల సైడ్ ఎఫెక్ట్‌ను కూడా ఈ టీ త‌గ్గిస్తుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం సమస్యని త‌గ్గిస్తుంది. అలాగే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరును మెరుగుపరుస్తుంది. అదేవిదంగా దీర్ఘ‌కాలికంగా ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న వారికి ఈ టీ చక్కటి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అలాగే ఈ టీనీ తాగడం వల్ల మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. వినికిడి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మ‌ధుమేహం కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఈ టీ నీ ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర వేసి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి. వేడి చేసిన నీటిని వ‌డ‌క‌ట్టి నాలుగు చుక్క‌లు నిమ్మ‌ర‌సం వేసుకుని తాగాలి.