Corona : కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు నిలుపుకోడానికి మరో బూస్టర్‌ డోస్‌ తప్పదా..?

కరోనా (Corona) మహమ్మారిని వదలడం లేదు..చాపకింద నీరులా మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు పలురకాల వేరియంట్ లలో మనుషుల్లోకి ప్రవేశించి ప్రాణాలు తీసుకున్న ఈ మహమ్మారి..ఇప్పుడు మరోసారి దేశంలో విజృభిస్తుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2997 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. […]

Published By: HashtagU Telugu Desk
New COVID Variant

Corona Turmoil Again.. Are The States Ready..

కరోనా (Corona) మహమ్మారిని వదలడం లేదు..చాపకింద నీరులా మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు పలురకాల వేరియంట్ లలో మనుషుల్లోకి ప్రవేశించి ప్రాణాలు తీసుకున్న ఈ మహమ్మారి..ఇప్పుడు మరోసారి దేశంలో విజృభిస్తుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2997 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయంటే అర్ధం చేసుకోవాలి. ఈ మహమ్మారి దెబ్బకు మరోసారి బూస్టర్‌ డోస్‌ తప్పేలా లేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక వేరియంట్‌ ప్రభావం తగ్గే లోపే కొత్త వేరియంట్‌ (Corona New Variant ) వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కొన్ని రోజులకు తగ్గుముఖం క్రమంగా పట్టిన కరోనాకు ప్రజలు నెమ్మదిగా అలవాటు పడటం మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 ఇప్పుడు హడలెత్తిస్తోంది. క్రమంగా పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య పాతరోజులను గుర్తుకు తెస్తోంది. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్‌ ఒకటే. కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్‌ డోస్‌ (Corona Booster Dose)లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా అని. వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదే కానీ.. వృద్ధులు, షుగర్‌, బీపీ, హార్ట్‌, కిడ్నీ, లివర్‌ పేషెంట్లు డాక్టర్లను సంప్రదించి బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం బెటర్‌ అంటున్నారు నిపుణులు. గత వేరియంట్లతో కంపేర్‌ చేసుకుంటే ఈ వేరియంట్‌ అంత ఎఫెక్టివ్ కాకపోయినా.. ఈ వేరియంట్‌ను లైట్‌ తీసుకోకూడదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది.

Read Also : CM Jagan: కోవిడ్ కొత్త వేరియంట్ పై జగన్ రివ్యూ, ముందస్తు చర్యలపై దృష్టి!

  Last Updated: 22 Dec 2023, 04:42 PM IST