Achal Ghar : అచల్ ఘర్, మౌంట్ అబూ

రాజ్ మచి లోని ఒక చిన్న గ్రామం అచల్ ఘర్. మౌంట్ అబూ (Achal Ghar, Mount Abu) నుండి 11 కి. దూరంలో గల ఈ ప్రాంతంలో ప్రసిద్ధ అచల్ ఘర్ కోట ఉంది.

Achal Ghar, Mount Abu : రాజ్ మచి లోని ఒక చిన్న గ్రామం అచల్ ఘర్. మౌంట్ అబూ (Achal Ghar, Mount Abu) నుండి 11 కి. దూరంలో గల ఈ ప్రాంతంలో ప్రసిద్ధ అచల్ ఘర్ కోట ఉంది. ఈ పర్వత కేంద్రానికి వచ్చే అనేక మంది పర్యాటకులు చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన అచల్ ఘర్ కోటను కూడా సందర్శిస్తారు. మొదట్లో పర్మార వంశపు రాజులచే అచల్ ఘర్ (Achal Ghar) లో నిర్మించబడి ఈ కోట తర్వాత మేవార్ రాజైన రాణా కుంభ క్రీ.శ. 1452 లో పునర్నిర్మించాడు.అచల్ ఘర్ కోట ప్రాంగణంలో అచలేశ్వర హమదేవ్ ఆలయం ఉంది. ఇది శివుని దేవాలయం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దేవాలయం లో వున్నఒక పవిత్రమైన రాతి పై శివుని పాదముద్రలు ఉన్నాయని విశ్వసిస్తారు. రాతి తో నిర్మించిన అతి పెద్ద మూడు నందులతో బాటుగా ఇత్తడితో చేసిన శివుని వాహన౦ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ కోటలో గల కొన్ని జైన దేవాలయాలు కూడా కోట ధార్మిక ప్రాముఖ్యత కు తోడ్పడుతున్నాయి. ఈ దేవాలయనికి హనుమాన్ పోల్, చంప పోల్ అనే రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని శత్రువుల దండయాత్రల నుండి కాపాడి, స్థానికులను సురక్షితంగా ఉంచడానికి అచల ఘర్ కోట ను నిర్మించారు.

Also Read:  Sunset Point : సన్ సెట్ పాయింట్, మౌంట్ అబూ