ఇటీవల కాలంలో బిజీ లైఫ్ స్టైల్‌లో పడి చాలా మంది శృంగార జీవితాన్ని (Romantic Life) ఆస్వాదించడం లేదు. కొంతమంది ఏదో మొహమాటానికి చేస్తున్నారు. కానీ శృంగారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వారి మధ్య శృంగార జీవితం బాగుండాలి.
కానీ ఇటీవల పెళ్ళైన యువత (Youth) పనిలో (Work) పడి బిజీ లైఫ్ వల్ల శృంగారాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కొంతమందికి దానిపై ఆసక్తి కూడా రావట్లేదు. శరీరంలో శృంగారంపై ఆసక్తి పెంచే కెమికల్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల శృంగారంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే వీటికి ఒక చక్కని పరిష్కారం ఉంది.
శృంగార వాంఛలను కలిగించే వాటిల్లో దానిమ్మ జ్యూస్ (Pomegranate Juice) ఒకటి. ఇందులో ఉండే పోషకాలు శృంగార సమస్యలను తగ్గిస్తాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల అంగస్తంభన సమస్య తగ్గుతుంది. దానిమ్మ జ్యూస్ వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్లు కావాల్సినంత ఉత్పత్తి అవుతాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శృంగార కోరికలు కూడా పెరుగుతాయి. అందుకే వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు కచ్చితంగా దానిమ్మ జ్యూస్ తాగి తమ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
