Leave Alone – Signs : ‘నన్ను వదిలెయ్’.. మీ భాగస్వామి ఇచ్చే 8 సంకేతాలివీ..

Leave Alone - Signs : ఒకవేళ మీ భాగస్వామి.. మీకు దూరం కావాలని భావిస్తే ఎలా ప్రవర్తిస్తారు ? మీతో ఎలా మెలుగుతారు ?

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 10:48 AM IST

Leave Alone – Signs : ఒకవేళ మీ భాగస్వామి.. మీకు దూరం కావాలని భావిస్తే ఎలా ప్రవర్తిస్తారు ? మీతో ఎలా మెలుగుతారు ? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? అనేది చాలా ముఖ్యం. రోజువారీ కార్యకలాపాల నుంచి దీనికి సంబంధించిన సంకేతాలు వెలువడుతుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

1.ఫీలింగ్స్‌లో నో క్లారిటీ 

మీతో దూరం పాటించాలని భావించే వ్యక్తి మీకు తన భావాలను వ్యక్తీకరించి చెప్పడంలో తడబడతాడు. మీ బాగు గురించి అతడికి విజన్ అనేది లేకుండాపోతుంది. అతడు చేసే పనుల్లో ఇదంతా ప్రతిబింబిస్తుంది. మీతో గ్యాప్‌ను పెంచుకోవాలని భావిస్తున్నందుకే.. ఇలా చేస్తున్నాడని పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకోవాలి.

2.నో రిప్లై 

ఎవరైనా మీ కాల్స్, టెక్స్ట్‌లను కంటిన్యూగా విస్మరిస్తే.. మీ నుంచి దూరం పాటించాలని కోరుకుంటున్నారని దాని అర్ధం.  మీతో మాట్లాడటం ఇష్టం లేక ఇలా చేస్తుంటారు. ఇలాంటి టైంలో గ్యాప్ పెరగడానికి దారితీసిన కారణాలను ఒకసారి రివ్యూ చేసుకోవాలి. తొందరపాటుతో కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి.

3.మీ కంటే స్నేహితులకే ఎక్కువ టైం  

మీ భాగస్వామి మీ కంటే అతడి సన్నిహితులు, స్నేహితులకే ఎక్కువ టైం ఇస్తే గ్యాప్ పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. మీ ప్రవర్తన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా రివ్యూ చేసుకోండి. దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. మీకు కాకుండా వేరే వారికి ప్రయారిటీ ఇస్తున్నారంటే.. ఇతరులు మీ కంటే గొప్పగా ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారో ఆలోచించండి.

4.ఎప్పుడూ బిజీ

మీ భాగస్వామి ఇంతకుముందు మీకు ఎక్కువ సమయాన్ని కేటాయించి.. ఇప్పుడు మీకు టైంను తగ్గిస్తే సందేహించండి. మీతో మాట్లాడటానికి, స్పెండ్ చేయడానికి కేటాయించే టైంను తగ్గించేసి.. దాన్ని వర్క్, ఇతర యాక్టివిటీస్‌‌‌కు వెచ్చిస్తుంటే పరిస్థితి మారిందని అర్థం. మీపై మీ భాగస్వామికి అభిప్రాయం మారిందనేందుకు ఇది సంకేతం. ఇలా ఎందుకు జరిగిందో అంచనా వేసే ప్రయత్నం చేయండి. సామరస్యంగా గ్యాప్‌ను తగ్గించుకోండి.  ఫ్రీ టైంలో ఇద్దరూ కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి.

5. తీవ్ర సంభాషణలకు దూరం

మీ భాగస్వామి మీతో వాదనకు దిగితే.. ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పాలని, మీరు ఒప్పుకునేలా చేయాలని భావిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీతో వాదనలను ఆపేసినా డేంజరే. ఎందుకంటే.. ఇక మీతో గ్యాప్ పాటించాలని భాగస్వామి డిసైడయ్యారనేది ఆ సైలెన్స్ యొక్క అర్ధం. మీతో వాగ్వాదానికి దిగి సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక అలా చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి.

6. సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేయరు 

మీతో సంబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు మీ భాగస్వామి ప్రయత్నాలు చేయకపోవడం అనేది డేంజర్ సిగ్నల్. మీతో గ్యాప్ ఉంటేనే బెటర్ అని భావిస్తే ఇలా చేస్తారు. భవిష్యత్తులో మీతో మీ భాగస్వామి అనుబంధాన్ని తెంచుకోవడానికి ఇది బాటలు వేసే ముప్పు ఉంటుంది.

7.ఎమోషనల్‌ డిస్టెన్స్ 

ఎవరైనా మీతో మానసికంగా దూరమైతే.. అదే నిజమైన దూరం. ఆ దూరాన్ని చెరపడం కష్టతరంగా మారుతుంది. ఈ దూరం ఏర్పడినవారు ఒకరి ఆలోచనలను ఒకరితో పంచుకోరు. ఏకాకిగా ఉండేందుకే ఇష్టపడతారు. వీలైతే విడిపోయేందుకు ప్రయారిటీ ఇస్తారు.

8. మీపై నిరాసక్తి 

మీ భాగస్వామి మీతో గ్యాప్ కోరుకుంటే.. మీపై ఆసక్తి చూపడు. మీ పనులపై శ్రద్ధ పెట్టడు. మీ కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేయడు. మీతో మానసికంగా ఏర్పడిన గ్యాప్ బాగా పెరిగితే.. ఇలా(Leave Alone – Signs) జరుగుతుంటుంది.

Also Read: Fruits For Diabetes: మీరు మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లు తినండి..!