Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. రాత్రి తగినంత నిద్ర లేకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా మీ శరీరానికి అలసట కలిగిస్తుంది. శరీరం సక్రమంగా పని చేయాలంటే, మెదడు యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇంతకంటే తక్కువగా నిద్రపోతే మీ గుండె, కిడ్నీలు మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒత్తిడి తగ్గిపోయి మీకు హాయిగా నిద్రపట్టేలా చేసే 7 లైఫ్‌స్టైల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని పాటిస్తే మీ నిద్రకు భంగం కలగదు, ఒత్తిడి కూడా పటాపంచలు అయిపోతుంది.
ఆహారపు అలవాట్లు:
నిద్రపోవడానికి ముందు అరటిపండు, గుమ్మడి గింజలు, బాదం, అక్రోట్, పిస్తా, జీడిపప్పు లేదా చామంతి హెర్బల్ టీ తాగితే మంచిది. ఇవి మీకు మంచి నిద్రను ఇస్తాయి. మెలటోనిన్ మరియు ఇతర ఖనిజాలు (minerals) కలిగిన ఆహార పదార్థాలు తింటే నిద్రలేమి సమస్య తొలగిపోతుందని ఒక ప్రయోగంలో నిరూపితమైంది. ప్రత్యేకించి వృద్ధులలో నిద్ర నాణ్యతను పెంచేందుకు ఇవి సహాయపడతాయి.
డిన్నర్ టైమ్:
నిద్రవేళకు, రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల సమయం (gap) ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం చేయడం:
వారానికి కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి.
హైడ్రేటెడ్ గా ఉండండి:
నీరు, ఫ్రూట్ జ్యూస్‌లు బాగా తాగండి. దీనివల్ల హైడ్రేటెడ్ గా ఉంటారు. ఇది మీ మానసిక స్థితిని కూడా యాక్టివ్‌గా చేస్తుంది మరియు అలసట దరిచేరకుండా చేస్తుంది.
సన్నిహితులతో చిట్ చాట్:
మీరు ఒత్తిడిగా ఫీల్ అయితే మీ సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ కలిగిన వారితో మీ అభిప్రాయాలను (opinions) పంచుకోండి. వారు ఇచ్చే సలహాలు పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉంటే వాటిని స్వీకరించండి.
విటమిన్ లెవల్స్ తనిఖీ చేయండి:
మీ శరీరంలోని విటమిన్ D, విటమిన్ B12 స్థాయిలను చెక్ చేసుకోండి. ఇవి కూడా శరీరానికి చాలా అవసరం. ఇవి లేకపోవడం వల్ల కూడా మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది.
ఉదయం సూర్యకాంతి:
ఉదయం వేళ సూర్యకాంతిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండండి. సూర్యకాంతి అనేది విటమిన్ D యొక్క సహజ మూలం.
స్క్రీన్ టైమ్:
రాత్రి నిద్రపోయే చివరి నిమిషం దాకా చాలామంది ఫోన్‌లోనే గడుపుతారు. ఇది మంచిది కాదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు మీరు ఫోన్ చూడటం ఆపేయండి.
కెఫిన్ పానీయాలు:
నిద్రపోయే సమయానికి ముందు కాఫీ, టీ తాగకూడదు. దీనివల్ల బెడ్‌పై పడుకోగానే వెంటనే నిద్రపట్టదు.
