పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరిచే ప్రబలమైన ప్రొబయోటిక్. అయితే కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరానికి లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార కలయికలు శరీరంలో విషపూరిత ప్రభావాలను కలిగించి జీర్ణ సమస్యలతో పాటు చర్మ రుగ్మతలు, అలెర్జీలు రావడానికి కారణమవుతాయని సూచిస్తున్నారు.
పెరుగు మరియు చేపల కలయిక అత్యంత హానికరమైనదిగా పరిగణించబడుతోంది. చేపలు వేడిగా ఉండగా, పెరుగు చల్లగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జీర్ణ తంతువులపై ప్రభావం చూపి అలెర్జీలు, చర్మ వ్యాధులు, ఆమ్లత వంటి సమస్యలను కలిగించవచ్చు. అలాగే ఉల్లిపాయతో పాటు పెరుగు తినడం కూడా జీర్ణవ్యవస్థకు తలకిందులుగా పనిచేస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, కడుపులో వాపు వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
చాలామంది చల్లని పెరుగు తిన్న తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తీసుకుంటారు. కానీ ఇది కూడా మంచిది కాదు. వేడి-చల్లటి పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణ స్థాయిలో అసమతుల్యత ఏర్పడి, జీర్ణక్రియ బలహీనపడుతుంది. అలాగే పెరుగు లాభదాయకమైన బ్యాక్టీరియాను టీ లేదా కాఫీ ఉష్ణోగ్రత చంపేయొచ్చు. దీంతో పేగుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది.
అంతేగాక మినప్పప్పు, పుల్లని పండ్లు లేదా నిమ్మకాయతో కలిపి పెరుగు తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పదార్థాలు కఫ దోషాన్ని పెంచుతాయి. దీని ప్రభావంగా శ్వాస సమస్యలు, అలసట, ఆస్తమా, సైనస్ లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. నిమ్మకాయ లేదా పుల్లని పండ్లతో కలిపి పెరుగు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా అలెర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పెరుగు తీసుకునేటప్పుడు సరైన ఆహార కలయికలను పాటించటం అవసరం.