Site icon HashtagU Telugu

YS Sharmila : ఏఐసీసీ అగ్రనేతలతో వైస్ షర్మిల భేటీ

Sharmila Meets Soniya

Sharmila Meets Soniya

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో భేటీ అయిన షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీలో ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని వైఎస్ షర్మిల ఎక్స్​లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో కాంగ్రెస్ ఒక బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని పేర్కొన్నారు. ఇక రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి చెందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. హస్తం పార్టీ ఓడిపోవడానికి షర్మిల వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ, మరికొంత మంది నేతలు కూడా బాహాటంగానే విమర్శలు చేయడం జరిగింది. షర్మిల టికెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపించారు.

Read Also : Good News : ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపిన కూటమి సర్కార్