Site icon HashtagU Telugu

Amritsar Golden Temple : గోల్డెన్ టెంపుల్‌లో అపచారం..

Amritsar Golden Temple

Amritsar Golden Temple

అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ (Amritsar Golden Temple) లో అపచారం చోటుచేసుకుంది. టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ..గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య (young woman suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన తెలియగానే పోలీసులు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి ఒంటరిగా దేవాలయానికి వచ్చినట్లు సీసీ కెమెరాలో నమోదైందని , ఆమె ఎవరు..? ఏ ప్రాంతవాసి..? ఆత్మహత్యకు కారణాలు ఏంటి..? అనేదానిఫై పోలీసులు అరా తీస్తున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని సివిల్‌ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాల్‌జిత్‌ సింగ్‌ తెలిపారు.

గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఏడు అంతస్తులోని గురుద్వారా బాబా అటల్ రాయ్‌ని సందర్శించడానికి ఉ 7.30 నుంచి రాత్రి 10.30 వరకు అవకాశం కలిపిస్తారు. సదరుయువతి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భవనం ఎక్కి ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన తర్వాత తొక్కిసలాట జరిగింది. గురుద్వారా సాహిబ్ సేవకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్న యువతీ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని అంచనా వేశారు.

ఇక ఈ గోల్డెన్ టెంపుల్ విషయానికి వస్తే.. ఈ ఆలయాన్ని “శ్రీ హర్మందిర్ సాహిబ్” లేదా “దర్బార్ సాహిబ్” గా కూడా పిలుస్తుంటారు. సిక్కుల పవిత్ర ఆలయాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో ఉంది. గోల్డెన్ టెంపుల్ స్వర్ణమయం చేసిన నిహారికను అందంగా ప్రతిబింబిస్తూ, ఒక సరస్సు మధ్యలో నిర్మించబడింది. ఈ గోల్డెన్ టెంపుల్‌ సుమారు 16వ శతాబ్దంలో గురు అర్జున్ దేవ్‌జీ ఆధ్వర్యంలో నిర్మించబడింది. గురు అర్జున్ దేవ్‌ గురు గ్రంథ సాహిబ్‌ను (సిక్కు మత గ్రంథం) ఆలయంలో ఉంచి పఠించేవారు. ఆలయం పైన స్వర్ణం (సోనం) తో పొదిగిన కారణంగా “గోల్డెన్ టెంపుల్” అని ప్రసిద్ధి చెందింది. ఆలయం చుట్టూ ఒక సరోవర్ (నీటి సరస్సు) ఉంది, దీనిని “అమృత్ సర” అని అంటారు. దీనివల్లే అమృత్‌సర్ నగరానికి పేరు వచ్చింది. ఈ నీటిని పవిత్రంగా భావిస్తూ భక్తులు ఇందులో స్నానం చేస్తారు.

గోల్డెన్ టెంపుల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక భోజన సేవ (లంగర్) నిర్వహిస్తారు. భక్తులందరికీ ఉచిత భోజనం అందించడం ఈ లంగర్‌లో ప్రత్యేకత. రోజూ ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, సందర్శకులు వస్తారు. ఆలయ సందర్శన సమయాలు ఉదయం 7:30 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఉంటాయి. గోల్డెన్ టెంపుల్ సిక్కు సంప్రదాయానికి మాత్రమే కాక, భిన్న మతాలకు చెందిన భక్తులను సైతం ఆకర్షిస్తూ, మతసామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది.

Read Also : Jonnalagadda Chaithanya : నిహారిక స్నేహితురాలిని చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడా..?

Exit mobile version