Weekly 55 Hours Work : అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) అనే యువ సీఏ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో పనిచేసేది. ఈ కంపెనీలో చేరిన నాలుగునెలల్లోనే అధిక పనిభారంతో ఆమె తీవ్ర ఒత్తిడి లోనైంది. చివరకు ఇటీవలే ప్రాణాలు విడిచింది. దీనిపై బాధాతప్త మనసుతో అన్నా సెబాస్టియన్ తల్లి.. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ సీఈవోకు ఓ లేఖ రాశారు. కేంద్ర కార్మిక శాఖ కూడా ఈ అంశంపై దర్యాప్తును మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో మన దేశంలోని వివిధ రంగాల్లో పనిచేసే మహిళలపై ఉండే పనిభారంతో(Weekly 55 Hours Work) ముడిపడిన కీలక సమాచారం బయటికి వచ్చింది. వివరాలివీ..
Also Read :Iran Vs Sweden : మత గ్రంథం దహనం ఘటన.. 15వేల రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపిన ఇరాన్ : స్వీడన్
ఐఎల్ఓ నివేదికలోని కీలక అంశాలివీ..
- ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. భారత్‌లోని ఐటీ, కమ్యూనికేషన్, టెక్నికల్ ప్రొఫెషన్లలో పనిచేసే మహిళలపై అధిక పనిభారం ఉంది.
- భారత్‌లో ఐటీ, జర్నలిజం రంగాల్లో పనిచేసే మహిళలు ప్రతివారం సగటున 56.5 గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది.
- వారంలో ఐదు రోజుల పనిదినాలు ఉన్న కంపెనీల్లో మహిళా సిబ్బంది ప్రతివారం అదనంగా 11 గంటలు వర్క్ చేయాల్సి వస్తోంది.
- వారంలో ఆరు రోజుల పనిదినాలు ఉన్న కంపెనీల్లో మహిళా సిబ్బంది ప్రతి వారం అదనంగా 9 గంటలు వర్క్ చేయాల్సి వస్తోంది.
- టెక్నికల్ జాబ్స్ చేస్తున్న మహిళలు ప్రతివారం సగటున 53.2 గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది.
- ఐటీ, మీడియా రంగాల్లో పనిచేస్తున్న 15 నుంచి 24ఏళ్లలోపు మహిళలు ప్రతివారం సగటున 57 గంటల పాటు పనిచేస్తున్నారు.
- టెక్నికల్ ప్రొఫెషన్లలో ఉన్న మహిళాఉద్యోగులు ప్రతివారం 55గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది.
- పైవివరాలన్నీ భారత మహిళలకు సంబంధించినవి. ఇక జర్మనీలో ఐటీ, మీడియా రంగాల్లోని మహిళా ఉద్యోగులు ప్రతివారం సగటున 32 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇవే రంగాలకు చెందిన రష్యా మహిళలు ప్రతివారం సగటున 40 గంటలే పనిచేస్తున్నారు. దీన్నిబట్టి మనదేశంలో శ్రమదోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో టెక్నికల్ రంగాల్లో పనిచేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో 145 ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా భారత్‌కు 15వ ర్యాంకు వచ్చింది.