Site icon HashtagU Telugu

World Population Day: నేడు ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం.. భార‌త జ‌నాభా ఎంతంటే..?

World Population Day

World Population Day

World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. పెరుగుతున్న జనాభా కారణంగా వనరుల కొరత, కాలుష్యం, పేదరికం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో జనాభా నియంత్రణ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, దాని గురించి ఇతరులకు తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి స్ఫూర్తిదాయకమైన కోట్‌లు, సందేశాలను పంపవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో పంచుకోగల కొన్ని ప్రత్యేక కోట్‌లు, సందేశాలు ఇక్కడ ఉన్నాయి.

Also Read: Kisan Vikas Patra: పోస్టాఫీసులో ఈ ఖాతా గురించి తెలుసా..? పెట్టిన పెట్టుబ‌డికి రెండింత‌లు రాబ‌డి..!

ప్రపంచ జనాభా దినోత్సవం ప్రారంభం

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించింది. జూలై 11, 1987న ప్రపంచ జనాభా 5 బిలియన్ల మార్కును దాటింది. దీనిని “ఫైవ్ బిలియన్ డే” అని పిలుస్తారు. ఈ ముఖ్యమైన సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత 1989లో జనాభా పెరుగుదల సమస్యలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి, జనాభా నియంత్రణ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి జూలై 11ని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది.

ప్రపంచ దేశాలలో భారతదేశ జనాభా అత్యధికం. గత ఏడాది ఐక్యరాజ్యసమితి (UN) భారతదేశ జనాభాకు సంబంధించిన డేటాను ఇచ్చింది. UN ప్రకారం.. ప్ర‌స్తుత‌ భారతదేశ జనాభా 142.57 కోట్లు. ఇందులో అత్యధిక జనాభా హిందువులు, తరువాత ముస్లింలు ఉన్నారు. చివరి జనాభా గణన 2011 సంవత్సరంలో నిర్వ‌హించారు. ఆ గ‌ణ‌న‌లో హిందువులు 79.08 శాతం, ముస్లింలు 14.23 శాతం, క్రైస్తవులు 2.30 శాతం, సిక్కులు 1.72 శాతం ఉన్నారు. 13 ఏళ్ల క్రితం హిందువులు 96.62 కోట్లు, ముస్లింలు 17.22 కోట్లు, క్రైస్తవులు 2.78 కోట్లు, సిక్కులు 2.08 కోట్ల మంది ఉన్నారు. అంటే హిందువులు, ముస్లింల జనాభాలో 79.40 కోట్ల వ్యత్యాసం ఉంది. వచ్చే జనాభా లెక్కల నాటికి హిందువుల జనాభా 80.3 శాతానికి పెరుగుతుందని, ముస్లిం జనాభా తగ్గుతుందని లేదా స్థిరంగా ఉంటుందని కొన్ని నివేదిక‌లు పేర్కొన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.