Narendra Modi: న‌రేంద్ర మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపిన ఇత‌ర దేశాల నాయ‌కులు..!

  • Written By:
  • Updated On - June 5, 2024 / 11:22 PM IST

Narendra Modi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఈ పరిస్థితిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ముగ్గురు నాయకులు ప్రధాని మోదీని అభినందించారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు.

రెండు దేశాల మధ్య స్నేహం మరింత పెరుగుతోంది: బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. పిఎం మోదీ, ఎన్‌డిఎతో పాటు, దేశంలోని 650 మిలియన్ల ఓటర్లను కూడా బిడెన్ అభినందించారు. మన రెండు దేశాల మధ్య స్నేహం మరింత పెరుగుతోందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సునక్ హిందీలో పోస్ట్ చేసారు

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ప్రధాని మోదీతో మాట్లాడానని, ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన యూకే, భారత్ మధ్య అత్యంత సన్నిహిత స్నేహం ఉందన్నారు. అందరం కలిసి ఈ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తామ‌ని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Also Read: Suspend : సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ కఠిన చర్యలు

పుతిన్ శుభాకాంక్ష‌లు

భారతదేశపు అత్యంత పాత స్నేహితుల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. దయచేసి నా అభినందనలు అంగీకరించండి. న్యూ ఢిల్లీతో విశేష వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తున్నాము. మీ ప్రభుత్వ కార్యకలాపాలలో మీరు కొత్త విజయాలు సాధించాలని, అలాగే మంచి ఆరోగ్యం, శ్రేయస్సును ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

మోదీతో కలిసి ఉన్న ఫొటోను మాక్రాన్ పోస్ట్ చేశారు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సెల్ఫీని పోస్ట్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు భారతదేశంలో పూర్తయ్యాయని రాశారు. నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీకి అభినందనలు. భారత్‌, ఫ్రాన్స్‌లను కలిపే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామ‌ని ట్వీట్ చేశారు.