Site icon HashtagU Telugu

Suicide Attempt: ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి​

Sucide Imresizer

Sucide Imresizer

కర్ణాటక రామనగరలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుల బాధ తాళలేకే ఆ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన రామనగర తాలూకా దొడ్డ మన్నగుద్దె గ్రామంలో జరిగింది. మంగళమ్మ(28) అక్కడికక్కడే మృతి చెందింది. అప్పుల బాధ భరించలేక గురువారం (ఫిబ్రవరి 2) మధ్యాహ్నం పొలంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు గురువారం సాయంత్రం రామనగర జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. రామనగరలో ప్రాథమిక చికిత్స అందించి మాండ్యా ఆస్పత్రికి తరలించారు.

Also Read: Children Dragged By Train: ఘోరం.. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి 100 మీటర్లు లాక్కెళ్లిన రైలు

మంగళమ్మ (28), మంగళమ్మ భర్త రాజు (31), మంగళమ్మ తల్లి సోమపురాడమ్మ (48), కుమారులు ఆకాష్ (9), కృష్ణ (13), మంగళమ్మ చెల్లెలు సవిత (24), సవిత కుమార్తె దర్శిని (4) విషం తాగారు. మంగళమ్మ భర్త రాజు సుమారు 10 లక్షలు అప్పు చేశాడు. రాజు స్వస్థలం బెంగళూరు దక్షిణ తాలూకా సుబ్బరాయనపాళయ గ్రామం. అప్పుల బాధతో భార్య ఊరు దొడ్డమన్నుగుద్దె గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ కూడా రుణదాతల పోరు కొనసాగుతున్న కారణంగా ఆత్మహత్యకు యత్నించాడు.