Suicide : ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని

Published By: HashtagU Telugu Desk
Deaths

Deaths

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గంగ అనే కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసు భద్రతా విభాగంలో ఆమె విధులు నిర్వ‌ర్తిస్తుంది. గత ఏడాది కాలంగా పార్లమెంట్ హౌస్‌కు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న త‌రువాత‌… సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించనప్పటికీ, మహిళా కానిస్టేబుల్‌ను సీనియర్ ర్యాంక్ అధికారి వేధించ‌డంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకంద‌ని అనుమారిస్తున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు న‌మోదు కాలేదు. కుటుంబ సభ్యులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు చేశామని, ఇప్పటివరకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మరణించిన మహిళా కానిస్టేబుల్ చాలా సెలవులు తీసుకున్నట్లు తెలిపారు.ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసులు మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నారు.

  Last Updated: 24 Dec 2022, 07:07 AM IST