Site icon HashtagU Telugu

Railway Jobs : 1376 రైల్వే జాబ్స్.. అన్నీ పారామెడికల్ పోస్టులే

Railway Jobs Degree Qualifications

Railway Jobs : 1376 జాబ్స్ భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు(Railway Jobs) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 713 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు, 246 ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు, 126 హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III పోస్టులు ఉన్నాయి. 94  ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు,  64 రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్  27 పోస్టులు, డయాలసిస్ టెక్నీషియన్ 20 పోస్టులు, ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II  20 పోస్టులు, ఫీల్డ్ వర్కర్ 19 పోస్టులు, ఈసీజీ టెక్నీషియన్ 13 పోస్టులు ఉన్నాయి.  క్లినికల్ సైకాలజిస్ట్ 07 పోస్టులు, డైటీషియన్ (లెవల్-7)  05 పోస్టులు, కార్డియాక్ టెక్నీషియన్ 04 పోస్టులు, ఆప్టోమెట్రిస్ట్ 04 పోస్టులు, అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్ 04 పోస్టులు, డెంటల్ హైజీనిస్ట్ 03 పోస్టులు, పెర్ఫ్యూషనిస్ట్ 02 పోస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 02 పోస్టులు, క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 02 పోస్టులు, స్పీచ్ థెరపిస్ట్ 01 పోస్టు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

పైన మనం చెప్పుకున్న పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీలో పాసై ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.500 ఫీజు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్షలో ప్రొఫెషనల్ ఎబిలిటీ  నుంచి 70 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అర్థమెటిక్స్​, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష 90 నిమిషాల పాటు జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి ఆర్‌ఆర్‌బీకి చెందిన  అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పుర్, అజ్‌మేర్, గోరఖ్‌పుర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పుర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం రీజియన్లలో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.

Also Read :Anti Diabetic Plant : షుగర్‌ను తగ్గించే మొక్క.. ఎక్కడ దొరికిందంటే.. ?

Exit mobile version