Site icon HashtagU Telugu

Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?

Taxes Reduce

Taxes Reduce

ఇప్పుడు అందరి చూపు.. రాబోయే బడ్జెట్‌ (Budget) వైపే ఉంది. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ వర్గాలకు చెందిన వారు బడ్జెట్ ప్రకటనల కోసం ఆతురుతగా ఎదురు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపించిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో.. తమకు ఏవైనా తీపి కబురులు వినిపిస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. ఆదాయపు పన్నులో కొంత ఉపశమనం ఇచ్చేలా ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇంకొందరైతే బడ్జెట్ (Budget) పెద్దగా ఆశాజనకంగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. పెద్దగా కేటాయింపులు, ఊరటలు, ప్రోత్సాహకాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు.

శాలరీ క్లాస్ (Salary Class) పీపుల్ డిమాండ్:

ఉద్యోగులపై ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని శాలరీ క్లాస్ పీపుల్ లో చాలా కాలంగా డిమాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిబంధనలలో ప్రభుత్వం ఎటువంటి పెద్ద సంస్కరణలను ప్రకటించలేదు.  ప్రత్యామ్నాయ ఆదాయపు పన్నును ఖచ్చితంగా ప్రకటించారు. కానీ ఉపశమనం ఇచ్చే విషయంలో ఇది అంత ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదనే ఒపీనియన్ ఉంది. పన్ను స్లాబ్‌ లను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించాలని ఉద్యోగ వర్గం డిమాండ్ చేస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానంలో వర్తించే రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ ను పెంచాలని అనేక విజ్ఞప్తులు కూడా ఉద్యోగ వర్గం చేసింది. కరోనా మహమ్మారి తర్వాత పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల దృష్ట్యా ఉద్యోగ వర్గం ఈ డిమాండ్లను లేవనెత్తుతోంది. అయితే రాబోయే బడ్జెట్‌లో ఆ అంశాలపై ప్రకటనలు వస్తాయనే ఆశలు అంతగా లేవు. మళ్ళీ కరోనా ఉధృతి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటు తగ్గే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కఠినమైన సవాలు లాంటిది. అందుకే ఈ బడ్జెట్లో భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆర్ధిక మంత్రి (Finance Minister) ఏం చేయనున్నారు?

2023-2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక వ్యయాన్ని నివారించి, స్థిరీకరణ లక్ష్యంతో బ్యాలెన్స్ డ్ రూట్ ను అవలంబిస్తారని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో రానున్న బడ్జెట్‌లో పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read:  Career : యూత్ లో కెరీర్ ఆందోళన.. మీలోని ఫియర్ ఫీలింగ్స్ ను ఇలా తెలుసుకోండి..!