Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 04:27 PM IST

Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్‌ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచలనం రేపుతున్నాయి. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఈ పరిణామం జరగడం రాజకీయాల్ని మరింత రసవత్తరంగా మార్చేశాయి. మణిపుర్‌లో అల్లర్లు జరగడానికీ నెహ్రూయే కారణం అంటూ తేల్చి చెప్పిన ప్రధాని మోదీ…ఇప్పుడు కచ్చతీవు ద్వీపం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రజలకి చాటి చెప్పడమే తమ లక్ష్యం అని చెప్పకనే చెప్పారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై RTIలో పిటిషన్ వేసి ఈ వివరాలన్నీ సేకరించడాన్ని చూస్తుంటే…ఎన్నికల ముందు కావాలనే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోంది.

Read Also: KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్

తమిళనాడులోని రామేశ్వరానికి, శ్రీలంకకి మధ్యలో ఉంది కచ్చతీవు ద్వీపం. ఇటు భారత్‌తో పాటు అటు శ్రీలంక దేశాలకు చెందిన మత్స్యకారులు ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్లు. భారత్‌, శ్రీలంక మధ్యలో ఉన్న పల్క్ జలసంధి (Palk Strait)లో ఉన్న ద్వీపం విస్తీర్ణం 285 ఎకరాలు. పొడవు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 300 మీటర్లు. అంటే ఈ ద్వీపం ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వతం పేలిన సమయంలో ఈ ద్వీపం (Katchatheevu Island Dispute) ఏర్పడినట్టు చెబుతున్నారు సైంటిస్ట్‌లు. ఇటు భారత్‌ తీర ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో, అటు శ్రీలంకలోని Jaffna కి 62 కిలోమీటర్ల దూరంలో ఉందీ ద్వీపం. 20వ శతాబ్దం నాటికి ఇక్కడ క్యాథలిక్ చర్చ్‌లో అటు భారత్‌, ఇటు శ్రీలంకకు చెందిన భక్తులు, మత గురువులు ఇక్కడ ప్రార్థనలు చేసే వాళ్లు. ఒకప్పుడు ఈ ద్వీపంపై శ్రీలంకకు చెందిన జఫ్నా కింగ్‌డమ్‌ (Jaffna Kingdom) ఆధిపత్యం ఉండేది. ఆ తరవాత 17వ శతాబ్దంలో భారత్‌లోని రామ్‌నద్ కింగ్‌డమ్ అధీనంలోకి వెళ్లింది. బ్రిటీష్‌ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై ఎన్నో ఏళ్లుగా వాదులాడుకుంటున్నాయి భారత్, శ్రీలకం. 1920 నుంచే ఈ వివాదం మొదలైంది. బ్రిటీష్ కాలం నాటి సర్వే ఈ ద్వీపం శ్రీలంకకే చెందుతుందని స్పష్టం చేసింది. అయితే…ఈ వివాదం ముదురుతున్న సమయంలోనే 1974లో భారత్, శ్రీలంక మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ద్వీప సరిహద్దుపై ఓ నిర్ణయం కుదిరింది. కచ్చతీవు ద్వీపం నుంచి పశ్చిమ తీరంలో ఓ మైలు దూరంలో సరిహద్దుని నిర్ణయించారు. అది కాస్తా శ్రీలంక సముద్ర జలాల పరిధిలోకి వెళ్లింది.

Read Also: Congress : 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన కాంగ్రెస్

ఇప్పుడు ఈ వివాదం ఈ స్థాయిలో అలజడి సృష్టించడానికి ఓ కారణముంది. కచ్చతీవు ద్వీపాన్ని భారత్ శ్రీలంకకు అప్పజెప్పిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ తమిళనాడులో DMK పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు కలిసే భారత్‌కి చెందిన ద్వీపాన్ని వేరే దేశానికి కట్టబెట్టాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్, డీఎమ్‌కే మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ వివాదంతో ఒకేసారి రెండు పార్టీలకు గురి పెట్టొచ్చని భావిస్తోంది బీజేపీ. పైగా లోక్‌సభ ఎన్నికల ముందు ఈ విమర్శలు చేస్తూ రెండు పార్టీలనూ ఇరకాటంలో పడేసింది. కానీ…ఈ ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న DMK ప్రభుత్వం ప్రధాని మోదీ విమర్శల్ని తిప్పికొడుతోంది. అప్పట్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని తేల్చి చెబుతోంది. ప్రధాని చరిత్రని మార్చాలని చూస్తున్నారంటూ మండి పడింది. ఇదే వాదనని గట్టిగా వినిపిస్తున్నారు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. X వేదికగా ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టారు. తమిళనాడు ప్రజలకు నిజానిజాలేంటో తెలుసని, కచ్చతీవు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సారి దక్షిణాదిపైనా గురి పెట్టిన బీజేపీ ఈ వివాదంతో ఏ మేర రాజకీయ లబ్ధి పొందుతుందో చూడాలి.