Site icon HashtagU Telugu

BJP : వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తా : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Will campaign on behalf of BJP in the next elections: Kejriwal key comments

Will campaign on behalf of BJP in the next elections: Kejriwal key comments

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఛత్రసాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో బీజేపీ పనితీరుపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనితో పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ లూట్ అని అని విమర్శించారు. యూపీలో గత ఏడేళ్లుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని.. కానీ అది విఫలమైందన్నారు.

Read Also: Yahya Sinwar : యహ్యా సిన్వార్.. పేపర్, పెన్.. ఖతర్ సర్కారు కీలక ప్రకటన

కేజ్రీవాల్, ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీ పదేళ్ల పదవీకాలంపై ప్రశ్నలు లేవనెత్తారు. “10 సంవత్సరాలలో ఈ వ్యక్తులు(బీజేపీ నాయకులు) ఏమీ చేయలేదు. వచ్చే ఏడాదిలో ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండుతాయి ఇప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయండన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ను ప్రధాని ప్రకటిస్తే, నేను బీజేపీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు.

“హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ముగుస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. అలాంటప్పుడు హర్యానాలో 10 ఏళ్ల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏం చేసింది? గత 7 ఏళ్లుగా యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వీరి సీట్లు సగానికి తగ్గాయి. మణిపూర్‌లో 7 సంవత్సరాల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. రెండేళ్లుగా మణిపూర్ మండుతోంది.” అని వ్యాఖ్యానించారు.

Read Also:RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా