Nitishs Successor: నితీశ్ కుమార్.. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఫేమస్ పేరు. ఆయన ప్రస్తుతం బిహార్ సీఎంగా ఉన్నారు. నితీశ్‌కు చెందిన రాజకీయ పార్టీ జేడీయూ నేటి వరకు బిహార్ అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ను సాధించలేకపోయింది. అయితేనేం 2005 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర సీఎంగా ఆయనే ఉంటున్నారు. దీన్నిబట్టి నితీశ్ రాజకీయ చాణక్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ‘‘పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడమే.. రంగును మార్చడమే రాజకీయం’’ అనేది నితీశ్ నిర్వచనం. ఇన్ని ఎత్తులతో ఎదిగిన నితీశ్‌కు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.
Also Read :Phone Tapping Case: విదేశీ గడ్డపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్, శ్రవణ్ ఆలోచన అదేనా ?
నిశాంత్ కుమార్‌కు ఆ పదవేనా ?
- బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitishs Successor)కు ఒక్కరే కుమారుడు. ఆయన పేరు నిశాంత్ కుమార్.
- నిశాంత్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
- ‘‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’’ అని నిశాంత్ గతంలో చెబుతుండేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. ‘‘నరేంద్ర మోడీ పాలన బాగుంది’’ అని నిశాంత్ కితాబిస్తున్నారు.
- ఈ ఏడాది(2025) అక్టోబర్- నవంబర్ నెలల్లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిశాంత్ రెడీ అవుతున్నారు.
- నితీశ్ కుమార్ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడుతున్నందు వల్లే పాలిటిక్స్‌లోకి కుమారుడు నిశాంత్ రంగ ప్రవేశం చేస్తున్నారని తెలుస్తోంది.
- ఇప్పుడు నితీశ్ కుమార్ వయసు 74 ఏళ్లు. కుమారుడు నిశాంత్ వయసు 49 ఏళ్లు.
- రాజకీయాల్లోకి వచ్చే విషయంలో ఇంకా ఆలస్యం చేయొద్దని నిశాంత్‌కు నితీశ్ సూచన ఇచ్చారట.
- ప్రస్తుతం బిహార్‌లో బీజేపీతో జేడీయూకు పొత్తు ఉంది. ఇందులో భాగంగా తక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నా సీఎం సీటును నితీశ్‌కు ఇచ్చారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో నితీశ్‌కు ఈ ఛాన్స్ ఇచ్చారు.
- నితీశ్ కుమారుడు నిశాంత్ రాజకీయాలకు కొత్త. అందువల్ల ఆయనకు వెంటనే సీఎం స్థాయి పదవులు దక్కకపోవచ్చని అంటున్నారు. బీజేపీ అందుకు ఒప్పుకోదని చెబుతున్నారు.
- ఈసారి జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిశాంత్ గెలిస్తే మంత్రి పదవి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
- ఈదఫా బిహార్ సీఎం పదవిని బీజేపీ కైవసం చేసుకుంటుందని రాజకీయ పరిశీలకులు జోస్యం చెబుతున్నారు. మహారాష్ట్ర తరహాలో బిహార్‌లోనూ మిత్రపక్షాలపై బీజేపీ పైచేయిని సాధిస్తుందని అంటున్నారు.