Sanjay Gaikwad Reward: భారత రిజర్వేషన్ వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాహుల్ గాంధీ నాలుక నరికితే రూ.11 లక్షలు ఇస్తానని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) వివాదానికి తెర లేపారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే దూరంగా ఉన్నారు.
రిజర్వేషన్ వ్యవస్థపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు గాను శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ నాలుక నరికితే వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించడం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. ఎమ్మెల్యే గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ వివాస్పద విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యమైనప్పటికీ, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే గైక్వాడ్ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తాను సమర్థించబోనని చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు.
రాహుల్ గాంధీ విదేశాలలో ఉన్నప్పుడు, భారతదేశంలో రిజర్వేషన్ విధానాన్ని ముగించాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై గైక్వాడ్ రాహుల్ పై మండిపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం