అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధిస్తున్న అధిక టారిఫ్(Donald Trump Tariffs)లు భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul) విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) మౌనంగా ఉండడంపై ప్రశ్నలు లేవనెత్తారు. “టారిఫ్‌లు పెరుగుతున్నాయి, భారత రవాణా, తయారీ రంగాలపై ప్రభావం పడుతోంది. అయినా మోదీ ఎందుకు స్పందించడం లేదు?” అని రాహుల్ గాంధీ నిలదీశారు. “ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టి, వాటిని కార్పొరేట్ శక్తులకు ముఖ్యంగా అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు. అలాగే RSS, BJP రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నాయి. క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని RSS మౌలిక సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘ఆర్గనైజర్’ పత్రికలో వ్రాస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
Mark Shankar Health : పవన్ కళ్యాణ్ కుమారుడి కోసం అఘోరి ప్రత్యేక పూజలు
మరోవైపు ట్రంప్ తన టారిఫ్ విధానాలను సమర్థించుకుంటూ, ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. తాము విదేశీ దిగుమతులపై టారిఫ్‌లు పెంచడమంతా దేశీయ పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పుతున్నారు. అయితే యూఎస్‌లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు స్థానిక యువత సిద్ధంగా లేకపోవడం, కంపెనీలు చీప్ లేబర్ కోసం విదేశీయులపై ఆధారపడుతున్న వాస్తవాలు ఎదురయ్యే సమస్యలుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విధానాలు వాస్తవికంగా ఎటువైపు దారితీస్తాయో చూడాల్సిన అవసరం ఉంది.