Site icon HashtagU Telugu

Foxconn – Padma Bhushan : యాంగ్ లీకి పద్మభూషణ్.. ఇండియాలో తైవాన్ వెలుగులు.. ఎవరాయన ?

Foxconn Padma Bhushan

Foxconn Padma Bhushan

Foxconn – Padma Bhushan : వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన నలుగురికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది.  వీరిలో యాంగ్ లీ (తైవాన్), సీతారామ్ జిందాల్ (కర్ణాటక)లకు పద్మభూషణ్ అనౌన్స్ చేశారు. ఇక కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ (కర్ణాటక)లక పద్మశ్రీ దక్కింది.  ఇంతకీ యాంగ్ లీ ఎవరు ? అనుకుంటున్నారా ? ఈయన మరెవరో కాదు.. తైవాన్‌కు చెందిన దిగ్గజ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరర్ సంస్థ  ఫాక్స్‌కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) అధిపతి. ఆ కంపెనీ సీఈఓ అండ్ ఛైర్మన్‌ హోదాలో యాంగ్ లీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమకు యాంగ్ లీ కీలకమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. కరోనా సంక్షోభం చైనాను కుదిపేసినప్పటి నుంచి ఫాక్స్‌కాన్ కంపెనీ తమ పెట్టుబడుల్ని ఇండియాకు డైవర్ట్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకల్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తమిళనాడులో ఈ కంపెనీకి ఐఫోన్ తయారీ యూనిట్ సైతం ఉంది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌. యాపిల్ కంపెనీ కోసం ఐఫోన్లను తయారు చేసి సప్లై చేసేది ఫాక్స్‌కాన్ కంపెనీయే.  ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్  సీఈవో యాంగ్ లీకి భారత్‌లోనే మూడో అతిపెద్ద పౌర పురస్కారం(Foxconn – Padma Bhushan) లభించడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

Also Read :Republic Day 2024 : మన రిపబ్లిక్ డే చారిత్రక విశేషాలు ఇవిగో