Who Is Vikram Misri: ‘ఆపరేషన్ సిందూర్’ మే 7న జరిగిన నాటి నుంచి వివరాలన్నీ ప్రతిరోజూ మీడియా సమావేశంలో వెల్లడించిన ఉన్నతాధికారి విక్రమ్ మిస్రి. ఈయన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా కీలక హోదాలో సేవలు అందిస్తున్నారు. భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మే 10న విక్రమ్ మిస్రి మీడియా ఎదుట వెల్లడించారు. భారత ప్రభుత్వం తరఫున ఆయన ఆ ప్రకటన చేశారు. అందులో విక్రమ్ మిస్రి వ్యక్తిగత విషయమేం లేదు. అయితే కొందరు విచక్షణ లేని నెటిజన్లు రెచ్చిపోయారు. విక్రమ్ మిస్రిని, ఆయన కూతురిని టార్గెట్‌గా చేసుకొని ట్రోలింగ్‌కు తెగబడ్డారు. ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నారు. అయినా విక్రమ్ మిస్రి మౌనం వహించారు. తన సోషల్ మీడియా ఖాతాలను ఎవరికీ కనిపించకుండా ప్రైవేట్ మోడ్‌లోకి మార్చుకున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వంటి కీలక నేతలు విక్రమ్ మిస్రీకి అండగా ప్రకటనలు విడుదల చేశారు. ఆయన స్థాయిని గురించి వివరించే ప్రయత్నం చేశారు.
Also Read :Pak With Terrorists: ఉగ్రవాదులకు అండగా పాక్ ఆర్మీ.. అందుకే తిప్పికొట్టాం: భారత్
విక్రమ్ మిస్రీ విద్యాభ్యాసం గురించి..
- విక్రమ్ మిస్రి 1964 నవంబరు 7న జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో(Who Is Vikram Misri) జన్మించారు.
- 2024 జులై నుంచి ఆయన భారత 35వ విదేశాంగ శాఖ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
- 2022 జనవరి నుంచి 2024 జులై వరకు భారత డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియాగా విక్రమ్ సేవలు అందించారు.
- విక్రమ్ మిస్రి.. కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు.
- శ్రీనగర్, ఉధంపూర్‌లలోనే కొంతవరకు ఆయన పాఠశాల విద్య కొనసాగింది.
- తదుపరిగా వారి కుటుంబం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్లి స్థిరపడింది. గ్వాలియర్‌లో ఉన్న సిందియా స్కూల్‌లో విక్రమ్ మిస్రి చదువుకున్నారు.
- ఢిల్లీలో ఉన్న హిందూ కాలేజీలో ఆయన హిస్టరీ సబ్జెక్టులో డిగ్రీ చేశారు.
- జంషెడ్‌పూర్‌లో ఉన్న జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో విక్రమ్ మిస్రి ఎంబీఏ చేశారు.
Also Read :Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్.. చిన్న పొరపాటే అంటున్న డీకే
ప్రైవేటు రంగంలోనూ పనిచేసిన మిస్రి..
- విక్రమ్ మిస్రి భారత ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి ముందు ప్రైవేట్ రంగంలో వివిధ జాబ్స్ చేశారు.
- విక్రమ్ మిస్రి తొలుత యాడ్స్ రంగంలో పనిచేశారు. ఢిల్లీలో ఉన్న లింటాస్ ఇండియా – బాంబే మరియు కాంట్రాక్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారు.
- యాడ్ ఫిల్మ్ మేకింగ్ రంగాలలోనూ విక్రమ్ మూడు సంవత్సరాలు పనిచేశారు.
- విక్రమ్ మిస్రి అమెరికాలోని ఆస్పెన్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా లీడర్‌షిప్ ఇనీషియేటివ్‌లో ఫెలోగా ఎంపికయ్యారు. ఇప్పుడు దీన్ని ‘కమల్‌నయన్ బజాజ్ ఫెలోషిప్’ అని పిలుస్తున్నారు.
- డాలీ మిస్రీని విక్రమ్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇండియన్ ఫారిన్ సర్వీసుకు ఎంపికయ్యాక..
- విక్రమ్ మిస్రి 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా తన కెరీర్‌ను మొదలుపెట్టారు.
- తన కెరీర్ తొలినాళ్లలో విక్రమ్ మిస్రి ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలలో ఉన్న భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు.
- గతంలో స్పెయిన్, మయన్మార్ దేశాల్లో భారత రాయబారిగా వ్యవహరించారు. 2014లో స్పెయిన్‌లో భారత రాయబారిగా, 2016లో మయన్మార్‌లో భారత రాయబారిగా మిస్రి నియమితులు అయ్యారు.
- 2019 జనవరి నుంచి 2021 డిసెంబరు వరకు చైనాలో భారత రాయబారిగా విక్రమ్ పనిచేశారు.
- విక్రమ్ మిస్రి.. మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీలకు ప్రైవేటు కార్యదర్శిగా సేవలు అందించారు.
- ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా సైతం మిస్రి పనిచేశారు.