Kejriwals Son In Law : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. ఆయన కుమార్తె హర్షితకు సంభవ్ జైన్‌తో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వివాహ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేజ్రీవాల్ తన సతీమణి సునీతతో కలిసి డ్యాన్స్ చేశారు. ‘పుష్ప2’ సినిమాలోని ‘సూసేకీ’ పాట హిందీ వెర్షన్‌కు కేజ్రీవాల్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 20న కేజ్రీవాల్ కుమార్తె వివాహ విందు ఉంది.
Also Read :Wild Cows Attack: అడవి ఆవుల ఎటాక్.. ఎందుకు ? ఏమిటి ?
కేజ్రీవాల్ అల్లుడు సంభవ్ జైన్ ఎవరు ?
- అరవింద్ కేజ్రీవాల్ అల్లుడు సంభవ్ జైన్(Kejriwals Son In Law) ఢిల్లీ ఐఐటీ గ్రాడ్యుయేట్.
- ఢిల్లీ ఐఐటీలోనే హర్షిత కూడా కెమికల్ ఇంజినీరింగ్ చేశారు.
- ఢిల్లీ ఐఐటీలో చదివేటప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
- ఇరు కుటుంబాల అంగీకారంతో సంభవ్, హర్షిత పెళ్లి జరిగింది.
- 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక హర్షిత గురుగ్రామ్‌లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో అసోసియేట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
- సంభవ్ ప్రస్తుతం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
- ఇటీవలే సంభవ్, హర్షిత కలిసి ‘బసిల్ హెల్త్’ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు.
- అరవింద్ కేజ్రీవాల్ ఏకైక కుమార్తె హర్షిత. దీంతో వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించారు.
- దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మనీష్ సిసోడియా, బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
- కేంద్ర ఎన్నికల సంఘానికి అరవింద్ కేజ్రీవాల్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన కుటుంబ ఆస్తుల విలువ కేవలం రూ.4.20 కోట్లే.
- కేజ్రీవాల్ పేరిట ఉన్న ఆస్తుల విలువ కేవలం రూ.1.73 కోట్లేనట.
- 2015 నుంచి 2024 వరకు కేజ్రీవాల్ఆస్తులు కేవలం రూ.1.30 కోట్లే పెరిగాయట.
- సాధారణంగా సీఎంలుగా పనిచేసిన వారి ఆస్తులు భారీగా పెరుగుతుంటాయి. కానీ కేజ్రీవాల్ విషయంలో అలా జరగకపోవడం గమనార్హం.