Who is Phangnon Konyak : నాగాలాండ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ వార్తలకు ఎక్కారు. ఇవాళ పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి తనపై అరుస్తున్నప్పుడు తాను చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని ఆమె ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read :Dharam Sansad : ‘ధర్మ సంసద్’ను ఆపలేం.. విద్వేష ప్రసంగాలను మానిటరింగ్ చేయండి : సుప్రీంకోర్టు
విపక్షాల నిరసనల గురించి కొన్యాక్(Who is Phangnon Konyak) మాట్లాడుతూ.. ‘‘ఆ నిరసనల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల నేను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఆశ్రయించాను. నాకు రక్షణ కల్పించమని అభ్యర్థించాను. నాలా ఏ మహిళా సభ్యురాలికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదు. దీనిపై ఇప్పటికే నేను నోటీసు పంపాను. విపక్షాలు నిరసన తెలుపుతున్న టైంలో నేను పార్లమెంటు మకర ద్వారం మెట్ల కింద నిలబడి ఉన్నాను. రాహుల్ గాంధీ నాకు చాలా దగ్గరగా వచ్చారు. అప్పుడు నిజంగా నేను అసౌకర్యానికి గురయ్యాను. రాహుల్ నాపై అరిచారు. అలా చేయడం అనేది ఒక నాయకుడికి తగదు’’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read :Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు
ఫాంగ్నాన్ కొన్యాక్ ఎవరు?
- ఫాంగ్నాన్ కొన్యాక్ నాగాలాండ్‌లోని దిమాపూర్ వాస్తవ్యురాలు.
- ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుంచి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
- ఆమె బీజేపీలో చేరడానికి ముందు విద్యార్థి విభాగాల్లో, సామాజిక సంస్థలలో పనిచేశారు.
- నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తొలి మహిళగా ఫాంగ్నాన్ కొన్యాక్ 2023 జులైలో చరిత్ర సృష్టించారు.
- ఆమె రాజ్యసభకు తాత్కాలికంగా అధ్యక్షత వహించే అవకాశాన్ని కూడా పొందారు.
- రవాణా, పర్యాటకం, సంస్కృతిపై పార్లమెంటరీ కమిటీ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సలహాలు ఇచ్చేందుకు నియమించిన కమిటీ, మహిళా సాధికారత కమిటీ సహా అనేక పార్లమెంటరీ కమిటీలలో కొన్యాక్ సభ్యురాలిగా ఉన్నారు.
- మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన గవర్నింగ్ కౌన్సిల్‌లోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.