Masood Azhar: కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్‌ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. రక్త కన్నీరు వచ్చేలా చేసింది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌కు చెందిన దాదాపు 14 మంది కుటుంబీకులు, సన్నిహితులు హతమయ్యారు. దీంతో అతడు ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. భారత సైన్యాన్ని తలుచుకొని మసూద్ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఇంతకీ ఇతడి నేపథ్యమేంటి ? ఒకప్పుడు భారత్‌కు చిక్కిన మసూద్ అజార్.. ఎలా రిలీజ్ అయ్యాడు ? పాకిస్తాన్‌లో అతడికి ఎన్ని ఉగ్రవాద ఫ్యాక్టరీలు ఉన్నాయి ? తెలుసుకుందాం..
Also Read :Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్‌మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ
మసూద్ అజార్ నీచమైన నేపథ్యం..
- మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవల్‌పూర్‌లో జన్మించాడు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత ఆర్మీ బహవల్‌పూర్‌లో ఉన్న మసూద్ అజార్ ఉగ్రవాద స్థావరంపై ఎటాక్ చేసింది. ఈ దాడిలోనే మసూద్ అజార్ కుటుంబీకులు 10 మంది చనిపోయారు.
- ప్రస్తుతం మసూద్ అజార్ వయసు 56 ఏళ్లు.
- మసూద్ అజార్ పాకిస్తాన్‌లో, పీఓకేలో 20కిపైగా మదర్సాలు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నడుపుతున్నాడు. వీటిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు.
- 1999లో IC-814 విమానం హైజాక్ తర్వాత మసూద్ అజార్‌ను ఉగ్రవాదులు కాందహార్‌కు తీసుకెళ్లి విడుదల చేశారు. అప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ఇతడి పేరు చేరింది.
- 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై ఉగ్ర దాడుల్లో కూడా మసూద్ అజార్ ప్రమేయం ఉంది.
- భారత్‌లోని పఠాన్‌కోట్ (2016) , పుల్వామా (2019) ఉగ్రదాడుల్లో మసూద్ అజార్‌దే కీలక పాత్ర. ఈ దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
- 2016లో ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లో ఉన్న భారత కాన్సులేట్‌పై జరిగిన ఉగ్రదాడికి మసూద్ అజార్ మాస్టర్‌మైండ్.
- 2019 మే 1న మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
విమానం హైజాకింగ్.. మసూద్ అజార్ విడుదల
ఉగ్రవాది మసూద్ అజార్(Masood Azhar) ఒకప్పుడు భారత దర్యాప్తు సంస్థల అదుపులోనే ఉండేవాడు. అయితే 1999 డిసెంబర్‌లో కీలక ఘటన జరిగింది. నేపాల్‌లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఐసీ814 విమానాన్ని మసూద్ అజార్ సన్నిహితులు హైజాక్ చేశారు. దాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. భారతదేశ దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న బందీలను విడుదల చేస్తేనే, విమానంలో ఉన్నవారిని విడిచిపెడతామని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసూద్ అజార్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత్ విడుదల చేసింది.