Lex Fridman : ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన లెక్స్ ఫ్రిడ్‌మన్.. ఎవరు ?

లెక్స్ ఫ్రిడ్‌మన్(Lex Fridman) జర్నలిస్టేం కాదు.. ఆయనొక  యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. 

Published By: HashtagU Telugu Desk
Lex Fridman American Podcaster Podcast With Pm Modi

Lex Fridman : లెక్స్ ఫ్రిడ్‌మన్.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత పాడ్ కాస్టర్. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 3 గంటల పాటు వీరిద్దరి సంభాషణ జరిగింది. ఇందులో ప్రధాని మోడీ వివిధ అంశాల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఫ్రిడ్‌మన్ వేసిన ఎన్నో ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానాలు ఇచ్చారు. ఈ పాడ్ కాస్ట్ ఇవాళ (ఆదివారం) ప్రసారం కానుంది.

Also Read :Aamir Khan : ఆల్రెడీ ముగ్గురు భార్యలతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్లిన ఆమీర్ ఖాన్..

లెక్స్ ఫ్రిడ్‌మన్ ఎవరు ? 

  • లెక్స్ ఫ్రిడ్‌మన్(Lex Fridman) జర్నలిస్టేం కాదు.. ఆయనొక  యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్.  ఈ పనిలోకి అడుగు పెట్టడానికి ముందు ఫ్రిడ్‌మన్ ఒక ఏఐ టెక్నాలజీ రిసెర్చర్.
  • లెక్స్ ఫ్రిడ్‌మన్  తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ, ఫిలాసఫీ, అంతర్జాతీయ అంశాల గురించి వీడియోలు, పాడ్ కాస్ట్‌లు పెడుతుంటారు. ఈ అంశాలపైనే ఆయన ప్రముఖులతో చర్చిస్తుంటారు.
  • ఫ్రిడ్‌మన్  1983లో ఉజ్బెకిస్తాన్‌లోని చక్లోవ్‌స్క్ ప్రాంతంలో జన్మించారు.
  • సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఫ్రిడ్‌మన్‌కు 11 ఏళ్ల వయసు ఉండగా, వారి ఫ్యామిలీ  అమెరికాలోని చికాగోకు చేరుకుంది.
  • ఫ్రిడ్ మన్ 2010లోనే కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు. తదుపరిగా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.
  • 2014లో ఫ్రిడ్ మన్‌కు గూగుల్‌లో జాబ్ వచ్చింది. ఏఐ ద్వారా మనుషులను గుర్తించే విభాగంలో అప్పట్లో ఆయన పనిచేశారు.
  • 2015లో ఆయన గూగుల్‌లో జాబ్‌ను వదిలేసి.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఏఐ అండ్ హ్యూమన్ రోబోటిక్స్  రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరారు.
  • 2018లోనే ఫ్రిడ్ మన్ తన యూట్యూబ్ ఛానల్ Lex Fridman ద్వారా ప్రజల్లోకి వచ్చారు.
  • ఇప్పటివరకు ఫ్రిడ్ మన్ ఇంటర్వ్యూ  చేసిన వారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, సైకాలజిస్ట్ జోర్డాన్ పీటర్సన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
  • ఫ్రిడ్ మన్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. ఆయనకు బ్రెజీలియన్ జియు జిట్సులో ఫస్ట్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ ఉంది.
  Last Updated: 16 Mar 2025, 07:42 AM IST