Site icon HashtagU Telugu

Forbes List 2023: ఫోర్బ్స్ జాబితాలోకి లిక్కర్ కింగ్

Lalit Khaitan Liquor

Lalit Khaitan Liquor

Forbes List 2023: భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో భారతీయుడి పేరు చేరింది. 80 ఏళ్ల వయసులో కుబేరుల జాబితాలో చేరిన వ్యక్తి సంపద, వ్యాపారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన లలిత్ ఖైతాన్.. 1972-73లో ‘రాడికో ఖైతాన్’ కంపెనీని టేకోవర్ చేసిన తర్వాత దాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి రోజూ శ్రమించేవాడు. అనుకున్న విధంగా విజయం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

లలిత్ ఖైతాన్ హయాంలో ‘రాడికో ఖైతాన్’ మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 PM విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ వంటి బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి కంపెనీ విలువ బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు.

ఖైతాన్.. అజ్మీర్‌లోని మాయో కాలేజీ, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసి, బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సు చదివారు.

గతంలో రాడికో ఖైతాన్‌గా పిలిచే ఈ కంపెనీని అంతకుముందు రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. కంపెనీ 1970ల ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్నప్పుడు ఖైతాన్ తండ్రి GN ఖైతాన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీ క్రమంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం, కంపెనీ బ్రాండ్లు దాదాపు 85 దేశాలలో విక్రయించబడుతున్నాయి.

Also Read: Health: ఉప్పు వాడకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా

Exit mobile version