Cash Pile : ఇటీవలే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ టైంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి భారీఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. వారు ఉన్నతా ధికారులకు సమాచారం ఇవ్వడంతో, ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల కట్టలన్నీ.. లెక్కల్లో చూపని నగదేనని పోలీసులు గుర్తించారు.
Also Read :Gold Jewellery: బంగారు నగలు అమ్మినా.. తాకట్టు పెట్టినా.. ఇవి తెలుసుకోండి
సుప్రీంకోర్టు కొలీజియం సీరియస్
ఈ విషయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం దాకా వెళ్లింది. దీనిపై హుటాహుటిన ఆరాతీసిన కొలీజియం.. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. గతంలో వర్మ అక్కడే పనిచేశారు. 2021 సంవత్సరంలోనే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు ఆయన వచ్చారు. కేవలం యశ్వంత్ వర్మ బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదన్న అభిప్రాయం సుప్రీంకోర్టు కొలీజియంలో వ్యక్తమైంది. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయాన్ని కొలీజియంలోని పలువురు వెలిబుచ్చారు.
Also Read :Bin Less Country : డస్ట్ బిన్ లేని దేశం.. వామ్మో.. అంత పెద్ద కారణం ఉందా ?
ఇలాంటిదే ఒక కేసులో..
2008 సంవత్సరం ఆగస్టు 13న ఇలాంటిదే ఒక ఘటన చోటుచేసుకొంది. నాటి పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి ఎదుట రూ.15 లక్షలున్న బాక్స్‌ను కొందరు వ్యక్తులు ఉంచారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఆ వ్యవహారాన్ని సీబీఐకు అప్పగించారు. అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్-హర్యానా కోర్టులో పనిచేశారు. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్‌కు ఇవ్వాల్సిన డబ్బును పొరబాటున జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్(Cash Pile) ఇంటి దగ్గర పెట్టారని విచారణలో వెల్లడైంది.