Yogesh Bairagi Vs Vinesh Phogat : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రత్యేకించి స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పొలిటికల్ ఫీల్డ్ హీటెక్కింది. జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్‌ను బరిలోకి దింపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో బీజేపీ కూడా ఆ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా వినేష్ ఫోగట్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈక్రమంలోనే బీజేపీ యూత్ లీడర్, కెప్టెన్ యోగేశ్ బైరాగికి(Yogesh Bairagi Vs Vinesh Phogat) జులానా అసెంబ్లీ టికెట్‌ను కాషాయ పార్టీ కేటాయించింది. దీంతో హర్యానా అంతటా జులానా స్థానంలో నెలకొన్న టఫ్ ఫైట్‌పై చర్చ నడుస్తోంది.
Also Read :Internet Banned In Manipur : మణిపూర్‌లో ఐదురోజులు ఇంటర్నెట్ బ్యాన్.. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 21 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో బీజేపీ రెండో లిస్టును విడుదల చేసింది. జులానా స్థానం నుంచి యోగేశ్‌ను బరిలోకి దింపుతున్నామని రెండో లిస్టులోనే బీజేపీ అనౌన్స్ చేసింది. ఇంతకీ యోగేశ్ బైరాగి ఎవరంటే.. ఆయన భారతీయ జనతా యువమోర్చా హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. బీజేపీ స్పోర్ట్స్ సెల్ హర్యానా విభాగం కో కన్వీనర్‌గా కూడా సేవలు అందిస్తున్నారు. యోగేశ్ బైరాగి మాజీ పైలట్ కూడా. ఆయన హర్యానాలోని జింద్ జిల్లా వాస్తవ్యుడు. హర్యానాలోని మొత్తం 90 సీట్లకుగానూ ఇప్పటివరకు 67 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.
Also Read :Centre Notifies GPS Based Toll System : శాటిలైట్ ఆధారిత టోల్ పద్ధతి అమల్లోకి.. కేంద్రం నోటిఫికేషన్.. ఏమిటిది ?
హర్యానా రాష్ట్రానికి చెందిన స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాలు ఇంతకుముందు వరకు రైల్వే శాఖలో జాబ్స్ చేసేవారు. అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తమ రైల్వే జాబ్స్‌కు రాజీనామా చేశారు. వినేష్ ఫోగట్‌కు కాంగ్రెస్ పార్టీ జులానా అసెంబ్లీ టికెట్‌ను కేటాయించగా.. బజరంగ్ పునియాకు కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించింది.