Site icon HashtagU Telugu

Didi Angry: మోదీ సర్కార్ పై దీదీ గుస్సా..వాటి నుంచి దృష్టి మ‌ర‌ల్చ‌డానికే మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టిస్తున్నారు.!!

Mamta

Mamta

నరేంద్రమోదీ సర్కార్ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గుస్సా అయ్యింది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేసింది. పెరుగుతున్న ధరల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తూ…కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి చెందుతోందని దీదీ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్యాస్‌, ఇతర వస్తువుల ధరలను పెంచుతూ.. పేద‌వారి న‌డ్డివిరుస్తోంద‌ని మండిపడ్డారు.

బుధ‌వారం మేదినీపూర్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రసంగించారు మమతా బెనర్జీ. గ్యాస్ లేదా ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా మతపరమైన ఉద్రిక్తతలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రేకెతిస్తుందని ఆరోపించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌ధాన‌ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే పనిచేస్తుందని మమతా ఆరోపించింది.

ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్లించేందుకే మోడీ సర్కార్ మతపరమైన కల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. దేశీయ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా కేంద్రం సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలపై చర్చ జరుగుతోంది. మార్చి 2022లో.. ప్రభుత్వం గృహావసర వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 50 పెంచి రూ. 949.50కి చేర్చింది. ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేర్చిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాలు రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా మత ఘర్షణలు త‌ల్లెత్తాయ‌ని మమతా బెనర్జీ గుర్తు చేశారు. రాష్ట్రానికి బకాయిలు విడుదల చేయడంలో విముఖతపై కేంద్రంపై దీదీ మండిపడుతున్నారు.

పశ్చిమ బెంగాల్ విషయంలో, కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నార. న్యాయబద్ధమైన బకాయిలు చెల్లించడం లేదని ఆమె ఆరోపించింది. MGNREGS, PM ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి వ‌చ్చే బకాయిలను తక్షణమే విడుదల చేయాల‌ని డిమాండ్ చేస్తూ మ‌మతా బెన‌ర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.