India Vs Pakistan: పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. పాకిస్తాన్ సైన్యం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది ? ఎటువైపు నుంచి దాడి చేస్తుంది ? ఎలా దాడి చేస్తుంది ? అనేది అర్థం కాక పాక్ ఆర్మీ తల గోక్కుంటోంది. ఈ భయంలో పాకిస్తాన్ ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ట్వీట్లు పెడుతున్నారు. ఈక్రమంలోనే పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. అందులో ఏముందో చూద్దాం..
Also Read :PM Modi Vs Kharge: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోడీపై ఖర్గే సంచలన ఆరోపణలు
బాసిత్ ట్వీట్‌లో ఏముంది ?
‘‘రష్యా విక్టరీ డే తర్వాత పాకిస్తాన్‌పై భారత్(India Vs Pakistan) దాడి చేసే అవకాశం ఉంది. మే 11,12 తేదీలలో పాక్‌పై భారత్ దాడి చేయొచ్చు’’ అని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు. ఆయన చెప్పిన తేదీలు కొంచెం అటూఇటూ అవుతాయేమో కానీ.. పాక్‌పై భారత్ దాడి చేయడం అనేది దాదాపు ఖాయమైంది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని భారత హోంశాఖ ఇచ్చిన ఆదేశాలే అందుకు స్పష్టమైన సంకేతం. పాకిస్తాన్‌తో పెద్దస్థాయి యుద్ధానికి దిగుతున్నందు వల్లే మాక్ డ్రిల్స్ నిర్వహణకు హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. చివరిసారిగా 1971లో భారత్ – పాక్ యుద్దం జరిగింది. అప్పట్లో మన దేశంలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు వాటిని బుధవారం రోజు నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్స్ జరిగిన వారం రోజుల్లోనే పాక్‌పై భారత్ ఎటాక్ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలకు, ఇప్పుడు పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ చెప్పిన తేదీలకు పొంతన ఉన్నట్టే కనిపిస్తోంది.