BJP Vs Mehbooba Mufti : లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఇటీవలే జమ్మూకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఇందుకు నిరసనగా ఒకరోజు ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆపేశారు. లెబనాన్ ప్రజలకు ముఫ్తీ సంఘీభావం తెలిపారు. ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్‌పై జరుపుతున్న దాడులను(BJP Vs Mehbooba Mufti) ఖండించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మెహబూబా ముఫ్తీ వైఖరిని కశ్మీర్ బీజేపీ నాయకుడు కవీందర్ గుప్తా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు మెహబూబా ముఫ్తీ ఎందుకు నోరు విప్పలేదు ? అప్పట్లో ఆమె ఎందుకు మౌనం వహించారు ?’’ అని ఆయన ప్రశ్నించారు. పీడీపీ చీఫ్ రెండు నాల్కల ధోరణికి మెహబూబా ముఫ్తీ తాజా ప్రకటన నిదర్శనమని కవీందర్ గుప్తా చెప్పారు.‘‘మెహబూబా ముఫ్తీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమెది నకిలీ సానుభూతి. కశ్మీరీ ప్రజలు ప్రతీదీ అర్థం చేసుకుంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Chicken Prices : చికెన్, ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు.. సామాన్యుల బెంబేలు
కాశ్మీర్‌కు చెందిన మరో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఎక్కడా యుద్ధం జరగకూడదు. ప్రజలు తమ జీవితాల్లో శాంతికి అర్హులే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలతో పరిష్కారం లభిస్తుంది. మెహబూబా ముఫ్తీ మతపరమైన కార్డును ప్లే చేస్తున్నారు. మతపరమైన ఓటు బ్యాంకు కోసం ఆమె ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్. మేం లెబనాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలో జరుగుతున్న అన్ని హత్యలను ఖండిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కేవలం ముస్లిం సమాజం ఓట్ల కోసం మెహబూబా ముఫ్తీ పాకులాడుతున్నారు. శుక్రవారం రోజు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా, ఆయన కుమార్తె జైనబ్ చనిపోయారు. హసన్ నస్రల్లా ఉన్న ప్రదేశం గురించి లెబనాన్‌లో ఉన్న ఒక ఇరాన్ గూఢచారి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీకి సమాచారం అందిందని అంటున్నారు.