Baba Siddique : మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అజిత్‌పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ ఇటీవలే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత శనివారం రోజు బాబా సిద్దిఖీని మర్డర్ చేసిన ఒక నిందితుడి ఫోనులో.. బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ ఫొటో కూడా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి ఈ హత్యకు పాల్పడిన షూటర్ల హిట్ లిస్టులో జీషాన్ కూడా ఉన్నాడని వెల్లడైంది. షూటర్లకు సుపారీ ఇచ్చిన వ్యక్తులే.. జీషాన్ సిద్దిఖీ ఫొటోను స్నాప్‌ఛాట్ (Baba Siddique) ద్వారా పంపారని విచారణలో తేలింది. స్నాప్‌ఛాట్ ద్వారానే షూటర్లు, సుపారీ ఇచ్చిన కుట్రదారులు ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. బాబా సిద్దిఖీ హత్యకు కుట్ర పన్నిన వారికి లారెన్స్ బిష్ణోయి గ్యాంగుతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. స్నాప్‌ఛాట్‌లో కుట్రదారులు, షూటర్ల మధ్య జరిగిన ఛాట్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేశారని తెలిసింది.
Also Read :Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’.. ఎందుకో తెలుసా ?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్లకు సుపారీ ఇచ్చిన వారు.. ఇప్పుడు బాబా సిద్దిఖీ హత్యకు సుపారీ ఇచ్చినవారు ఒకరేనా ? అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాాప్తు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడైన బాబా సిద్దిఖీ మర్డర్ వ్యవహారంలోనూ ఆ గ్యాంగ్ హస్తమే ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే బలమైన ఆధారాలు ఇంకా లభించాల్సి ఉంది. 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ 2015 నుంచి గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వ్యవహారంలోనూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినిపించింది.
Also Read :Agniveer : ఏపీలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం
బాబా సిద్ధిఖీని హత్య చేసే క్రమంలో షూటర్లు కారం పొడిని ఆ పరిసరాాల్లో స్ప్రే చేశారు. ఈవిషయాన్ని స్వయంగా సిద్దిఖీకి సెక్యూరిటీ ఇచ్చిన ఏకైక పోలీసు కానిస్టేబుల్ తెెలిపారు. కారం పొడి తన కళ్లలో పడటంతో షూటర్లపైకి కాల్పులు జరపలేకపోయానని చెప్పారు. తాను తేరుకునేలోపే షూటర్లు సిద్దిఖీపై కాల్పులు జరిపి పారిపోయారని పేర్కొన్నారు.