Site icon HashtagU Telugu

Shocking Video : 10ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలి…గ్రామస్థులు ఏం చేశారంటే…షాకింగ్, వైరల్ వీడియో..!!

Crocodile Demo

Crocodile Demo

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లో 10ఏళ్ల బాలుడిని మొసలి మింగేసింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై మొసలిదాడి చేసి…నదిలోకి లాక్కెళ్లి మింగేసింది. అది గమనించిన స్థానికులు వెంటనే అతని కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారం అధించారు.

బాలుడిని కాపాడాలని కర్రలు, తాడు, వల సాయంతో మొసలిని పట్టుకున్నారు. నదిలో నుంచి మొసలిని బయటకు తీసారు. కానీ మొసలి కడుపులో ఉన్న బాలుడిని ఎలా కాపాడాలో స్థానికులకు అర్థం కాలేదు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఎలిగేటర్ విభాగం, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే మొసలి కడుపులో తమ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తల్లిదండ్రులు, బంధువులు పోలీసులతో వారించారు. మొసలి కడుపులోనుంచి తమ బిడ్డను బయటకు తిసాకే…మొసలిని అప్పగిస్తామంటూ వాగ్వాదానికి దిగారు. మొసలి కడుపులో బాలుడు బ్రతికే అవకాశం లేదని తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొసలిని చంపినా పిల్లాడు బతకడని వారికి అర్థమయ్యేలా చెప్పారు. అధికారుల చొరవతో మొసలిని ఎట్టకేలకు నదిలోకి వదిలిపెట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.