War Can Come Anytime.. Should Be Ready : లక్నోలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. భారత్ ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని , శాంతిని కాపాడడానికి యుద్దం చేయాల్సిన అవసరం రావచ్చని అన్నారు.
సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ లక్ష్యం..
ఆత్మనిర్భర్ భారత్‌లో త్రివిధ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రష్యా – ఉక్రెయిన్ , ఇజ్రాయెల్ -హమాస్ , బంగ్లాదేశ్‌లో అలర్లను ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు . అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వస్తే సంసిద్దంగా బలగాలు ఉండాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముందని అన్నారు. సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ తమ లక్ష్యమన్నారు.
యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీ..
భవిష్యత్‌లో వచ్చే యుద్దాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా త్రివిధ బలాలను సిద్దం చేస్తునట్టు రక్షణశాఖ మంత్రి తెలిపారు. యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీగా ఉన్నట్టు తెలిపారు. సవాళ్లను ముందుగానే గుర్తించాలని కమాండర్లకు రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని కోరారు. సరిహద్దు దేశాల్లో ఉన్న సమస్యలు భారత్‌కు కూడా సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఇవి శాంతికి , స్థిరత్వానికి ఆటంకం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ప్రపంచంలో పలు దేశాలు యుద్దంతో ప్రభావితమవుతున్నప్పటికి , ఆ ప్రభావం భారత్‌పై లేకుండా చూస్తునట్టు వెల్లడించారు. అయితే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టం చేశారు.
Read Also:Hero Raj Tarun: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..!
మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ , భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్దంగా ఉండాలని ఆర్మీ కమాండర్లతో చెప్పారు రాజ్‌నాథ్. జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యమన్నారు . సాంప్రదాయ యుద్దసామాగ్రితో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలన్నారు. స్పేస్ ,ఎలక్ట్రానిక్ వార్ యుద్ద విధాలనాలపై దృష్టి పెట్టినట్టు రాజ్‌నాథ్ తెలిపారు. డేటా , కృత్రిమ మేథను కూడా కూడా యుద్ద విద్యలకు జోడించాలన్నారు. నేరుగా యుద్దంపై ఈ విధానాలు ప్రభావం చూపకపోయినప్పటికి పరోక్షంగా సాయపడుతాయన్నారు. భవిష్యత్‌లో రక్షణరంగంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు కమాండర్ల కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు.