Waqf Amendment Bill : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమ బుధవారం మధ్యాహ్నం కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. లోక్‌సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టకపోతే, పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు అని కిరణ్ రిజిజు సంచలన ప్రకటన చేశారు.
Read Also: Allu Arjun : పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ..కారణం అదేనా?
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించారు. వక్ఫ్ సవరణ బిల్లుని సమర్థించారు. మా ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీ లాంటిది కాదు. అది కేవలం ఓ రబ్బరు స్టాంప్. కానీ, మా కమిటీ క్షుణ్ణంగా చర్చలు జరిపింది. సూచనలు తీసుకుంది అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలించిందని.. క్యాబినెట్ ఆమోదం పొందే ముందు సూచనలను చేర్చిందని చెప్పారు. ఇకపోతే, దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.
కాగా, ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లును కేంద్రం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది. క్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. అయితే, గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో జేపీసీ పరిశీలనకు ఈ బిల్లుని పంపింది.
Read Also: YS Sharmila : దేశానికి ఈరోజు బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల కామెంట్స్