మాములుగా రెండు , మూడు గంటల ట్రైన్ ప్రయాణానికే వామ్మో..ఎప్పుడు దిగుతామో అని అనుకుంటాం. అలాంటిది ఒకే ట్రైన్ లో ఏకంగా 80 గంటల పాటు ప్రయాణం చేయాలంటే ఇంకేం అనుకోవాలి. అన్ని గంటల సేపు ప్రయాణం చేసే రైలు కూడా ఉందా అని అనుకుంటున్నారా..? ఉంది అది ఎక్కడో కాదో మన ఇండియన్ రైలే.
Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’ ఇంకా మిగిలే ఉంది – మావోలకు అమిత్ షా వార్నింగ్
భారతీయ రైల్వే దేశ ప్రజల జీవితాల్లో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. అందుబాటు ధరలు, ప్రయాణికులకు అందే సౌకర్యాలు, సుదూర ప్రాంతాలకు అనుసంధాన మాధ్యమంగా ఉండటం వంటి కారణాలతో ఎంతో మంది రైలు ప్రయాణాన్ని ప్రాధాన్యతనిస్తారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ అనుకూలంగా ఉండే ఈ ప్రయాణ విధానం, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాన్ని చేరే అవకాశం కల్పిస్తుంది. అయితే కొన్ని రైళ్లు తక్కువ సమయానికే గమ్యం చేరుతాయి గానీ, కొన్ని రైళ్లు చాలాకాలం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక రైలు, ప్రయాణికులను కూర్చొనేలా చేసి అలసటకు గురిచేస్తుంది – అదే వివేక్ ఎక్స్‌ప్రెస్(Vivek Express).
Insomnia Problem : నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుందా? ఈ నియమాలు పాటిస్తే దాన్ని దూరం చేయొచ్చు!
వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోనే అతి పొడవైన దూరాన్ని ప్రయాణించే రైలు. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి (Kanniyakumari and Dibrugarh) వరకు దాదాపు 4200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే నడిచే రైలు. దాదాపు 80 గంటల సమయం తీసుకొని ఇది తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. అంటే మూడు రోజులకుపైగా నిరంతరం రైలు ప్రయాణంలో ఉండాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో సుమారు 50 స్టేషన్లు మార్గమధ్యంలో వస్తాయి.
ఇంత పొడవైన ప్రయాణం వల్ల, ఈ రైల్లో ప్రయాణించే వారికి సహజంగానే అలసట కలుగుతుంది. కానీ ఇది భారతదేశంలో ఉత్తర నుండి దక్షిణ వరకు ప్రయాణించే అరుదైన రైలు కావడంతో ఎంతో ప్రత్యేకత కలిగినదిగా పరిగణించబడుతుంది. వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు, భాషలు, భిన్న జీవనశైలులను ఈ ప్రయాణంలో ఎదుర్కోవచ్చు. అందుకే ఈ రైలు కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాకుండా, భారతదేశ విభిన్నతను చూపించే జీవమంత ప్రయాణమవుతుంది.