Uttar Pradesh: వివాహ సమయంలో స్నేహితులు, బంధువులు వధూవరులకు పలు రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. కొందరు ఆకతాయి స్నేహితులు వింతైన గిప్టులతో వధూవరులను ఆటపట్టిస్తుంటారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెండ్లికొడుకు స్నేహితులు వధూవరులకు వింతైన గిఫ్ట్ ఇచ్చారు. పొడవాటి బ్లూ డ్రమ్ ను స్టేజీపైకి తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. దీంతో వరుడు ఆశ్చర్యంతో చూస్తుండిపోగా.. వధువు నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బ్లూ డ్రమ్ గిఫ్ట్ గా ఇచ్చిన వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఓరేయ్ ఎవర్రా మీరంతా.. ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా..? అంటూ మండిపడుతున్నారు.
Also Read: Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి అరెస్ట్!
స్నేహితులు సరదాగా బ్లూడ్రమ్ గిఫ్టుగా ఇస్తే అందులో తప్పేముంది.. నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు..? అనే డౌట్ మీకు రావొచ్చు. ఈ బ్లూ డ్రమ్ వెనుక పెద్దకథే ఉంది. యూపీలో జరిగిన ఓ దారుణ ఘటనను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. గత నెలలో నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పూత్ ను అతని భార్య ముస్కాన్ రస్తోగి హత్యచేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ మహిళ తన ప్రేమికుడు సాహిల్ తో కలిసి జీవించేందుకు తన భర్తను హత్యచేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. ప్రేమికుడు సాహిల్‌తో కలిసి తన భర్త సౌరభ్ కు మత్తుమందు ఇచ్చి హత్యచేసింది. అతని మృతదేహాన్ని ఇంట్లోని ఓ బ్లూకలర్ డ్రమ్ములో ఉంచి, దానిని సిమెంట్ తో నింపారు. పోలీసుల విచారణలో అసలు గుట్టు వెలుగులోకి రావటంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పెండ్లి కొడుకు స్నేహితులు వధూవరులకు బ్లూ డ్రమ్ము ఇవ్వడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దారుణ హత్యను ఓ చిన్నఘటనలా, ఫన్నీలా చూపేలా వారి వ్యవహారం ఉందంటూ మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. “దీనికంటే చెత్త జోక్ ఏముంటుంది! వివాహం వేడుక అంటే సంతోషకరమైన సందర్భం. అలాంటి సందర్భంలో ఒక దారుణమైన ఘటనను జోక్‌గా గుర్తుచేసుకోవడం సముచితం కాదు.” అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. “ఈ ప్రపంచంలో ఇంకా తెలివితక్కువ వ్యక్తులు ఉన్నారు. ఎంతటి అద్భుతం ఇది” అని అన్నారు. “మొరటుతనం ఎంత పరాకాష్టకు చేరిదంటే, అలాంటి వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదు” అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా నెటిజన్లు నూతన వధూవరులకు బ్లూ డ్రమ్ ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు.
इससे भद्दा मज़ाक और क्या हो सकता है! शादी जैसे खुशी के मौके पर एक जघन्य हत्याकांड को मज़ाक के रूप में याद करने को कतई उचित नहीं कहा जा सकता।
👉उत्तर प्रदेश के जिला हमीरपुर में शादी के दौरान दोस्तों ने दूल्हा–दुल्हन को “नीला ड्रम” गिफ्ट किया। pic.twitter.com/tvGnVlWsIb
— बेसिक शिक्षा सूचना केंद्र (@Info_4Education) April 19, 2025