UN Report : కోవిడ్ లో 50శాతం మంది మ‌హిళ‌ల‌పై హింస‌

కోవిడ్- 19 ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై హింస పెరిగిపోయింది. సుమారు 50శాతం మంది మ‌హిళ‌లు ప‌లు ర‌కాల హింస‌ను అనుభ‌వించారు.

  • Written By:
  • Updated On - November 25, 2021 / 02:35 PM IST

కోవిడ్- 19 ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌పై హింస పెరిగిపోయింది. సుమారు 50శాతం మంది మ‌హిళ‌లు ప‌లు ర‌కాల హింస‌ను అనుభ‌వించారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ఇళ్ల‌లో మ‌హిళ‌లు సుర‌క్షితంగా ఉండ‌లేక‌పోయారు. ఆ విష‌యాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి మ‌హిళా నివేదిక స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలోని 13దేశాల‌కు చెందిన మ‌హిళ, వాళ్ల‌కు తెలిసిన వ్య‌క్తుల నుంచి స‌మాచారాన్ని సేక‌రించి అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా ఆ విష‌యం వెల్ల‌డ‌యింది.
ఇంట్లోగానీ, బహిరంగ ప్రదేశాల్లోగానీ మహిళల భద్రతను కోవిడ్-19 ప్ర‌శ్నార్థ‌కం చేసింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి గృహాల్లో సంఘర్షణలు పెరిగాయ‌ని, అవి ఇప్ప‌టికే కొన‌సాగుతున్నాయ‌ని నివేదిక తేల్చేంది. నవంబర్ 25 న విడుదల చేసిన‌ నివేదిక ప్రకారం నాల్గవ వంతు మంది మహిళలు ఇంట్లో తక్కువ సురక్షితంగా ఉన్నార‌ని చెబుతోంది. శారీరక వేధింపులను 21 శాతం మంది మ‌హిళ‌లు ఎదుర్కొన్నార‌ని స‌ర్వే తేల్చింది. ఇతర కుటుంబ సభ్యులు (21 శాతం) , ఇంట్లోని ఇతర మహిళలు (19 శాతం) గాయపడుతున్నారని కొందరు మహిళలు ప్రత్యేకంగా నివేదించారు.

Also Read : జూనియ‌ర్ పై టీడీపీ డైరెక్ట్ అటాక్!

ఇళ్ల వెలుపల ఉండే మహిళలు కూడా హింసకు గురవుతున్నట్లు భావిస్తున్నారు. 40 శాతం మంది కోవిడ్ -19 ప్రారంభమైనప్పటి నుండి రాత్రిపూట ఒంటరిగా నడవడం తక్కువ సురక్షితంగా ఉందని చెప్పారు. కోవిడ్-19 సమయంలో బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తీవ్రమ‌య్యాయ‌ని ప్ర‌తి 5 మందిలో ముగ్గ‌రు మహిళలు భావించారు.ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆహార అభద్రత, కుటుంబ సంబంధాలు త‌దిత‌ర సామాజిక-ఆర్థిక ఒత్తిడులు కార‌ణంగా భద్రత (లేదా హింస) అనుభవాలపై మాత్రమే కాకుండా, మొత్తం మహిళల శ్రేయస్సుపై కూడా గణనీయమైన ప్రభావాన్ని కోవిడ్ చూపింద‌ని స‌ర్వే తేల్చింది. మహిళలపై హింస అనేది ఇప్పటికే ఉన్న ప్రపంచ సంక్షోభం, ఇది ఇతర సంక్షోభాలపై వృద్ధి చెందుతుంది. సంఘర్షణలు, వాతావరణ సంబంధిత ప్రకృతి వైపరీత్యాలు, ఆహార అభద్రత, మానవ హక్కుల ఉల్లంఘనలు త‌దిత‌రాలు మహిళలు, బాలికలల‌కు ప్రమాద‌కార‌కాలుగా మారాయి. సొంత ఇళ్లు, పరిసరాలు, కమ్యూనిటీలలో కూడా ప్రమాద భావనతో మ‌హిళ‌లు, పిల్ల‌లు జీవిస్తున్నార‌ని UN మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మీడియాకు వెల్ల‌డించింది.ఒంటరితనం, సామాజిక దూరం అనేవి కోవిడ్ 19ర సంద‌ర్భంగా అనివార్యం. ఇది మహిళలు, బాలికలపై హింస ను ప్రేరేపించింద‌ని స‌ర్వే స్పష్టం చేసింది.