Manipur Violence : భయంతో మహిళల పరుగులు.. ఇద్దరి మృతి.. మణిపూర్‌లో హింస

Manipur Violence : మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.

  • Written By:
  • Updated On - January 31, 2024 / 07:35 AM IST

Manipur Violence : మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. భద్రతా బలగాలు, పోలీసులను లెక్క చేయకుండా తీవ్రవాద మూకలు పేట్రేగుతూనే ఉన్నారు. మంగళవారం రోజు మైతై, కుకీ  తెగల సాయుధ గ్రూపుల మధ్య మరోసారి ఘర్షణలు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరుగుతున్న టైంలో ఆ ప్రాంతానికి చెందిన మహిళలు అరచేతిలో ప్రాణాలుపెట్టుకొని పరుగులు పెడుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. మణిపూర్‌లోని మైతై, కుకీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు ప్రముఖ సంఘాలు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంతో  చర్చలకు రెడీ అవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

మణిపూర్‌లో గతేడాది మే ప్రారంభం నుంచి మైతే, కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా చనిపోయారు. ఈ హింసాకాండ ప్రభావంతో దాదాపు 67,000 మంది వ్యక్తులు తమ ఇళ్లను విడిచిపెట్టి.. సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్లాల్సి వచ్చింది. మైతై వర్గానికి చెందిన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)  నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. ఇకపై హింసకు పాల్పడబోమని యూఎన్ఎల్ఎఫ్ ప్రకటించింది.  శాంతి ఒప్పందానికి ముందు నవంబర్‌లో కేంద్ర సర్కారు UNLF, ఇతర ఏడు గ్రూపులపై ఐదేళ్ల నిషేధాన్ని విధించింది.

Also Read : Hemant Soren : జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్‌.. నేడు హేమంత్ సోరెన్ అరెస్ట్ ?

ఈ ఘటన నేపథ్యంలో మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. దానిప్రకారం.. ‘‘మణిపూర్‌లో దాడుల పెరుగుదల ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది.  తీవ్రవాద గ్రూపులు మయన్మార్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేసుకుంటున్నా ఆపేవారు లేకుండా పోయారు. ప్రధానంగా చిన్-కుకి ఉగ్రవాదులకు మయన్మార్ నుంచి ఆయుధాలు అందుతున్నాయి. మణిపూర్‌లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటే ఇప్పటిదాకా హింస కొనసాగేదే కాదు. ఇప్పటికైనా గ్రౌండ్ వర్క్ కోసం కేంద్ర సర్కారు నడుం బిగించాలి. కేంద్ర సర్కారు ఇప్పటికైనా స్పందించకుంటే.. మేం మా గొంతు ఎత్తాల్సి ఉంటుంది. ఆందోళనకు దిగాల్సి ఉంటుంది’’ అని మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ ఈ ప్రకటనలో తెలిపింది.

Also Read :AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు