Vinay Mohan Kwatra: అమెరికా (America)లో భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రా మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆయన భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పదవీవిరమణ చేసిన తరణ్‌జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. తరణ్‌జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుండి 2024 వరకు ఉన్నారు. అమెరికాలో భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రాకు స్వాగతం పలకడం ఆనందగా ఉందని చార్జ్ డి అపైర్స్ శ్రీప్రియ రంగనాథన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా ఉత్సాహంగా ఉన్నామని అన్నారు. వినయ్ మోహన్ క్వాత్రా తన అధికారిక పత్రాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సమర్పించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ వాషింగ్టన్ డీసీ ప్రాంతానికి చెందిన ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం వినయ్ మోహన్‌కు స్వాగతం పలికేందుకు డల్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ వారు అతనిని కలవలేకపోయారు. గతంలో ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య మంత్రిగా పనిచేసిన క్వాత్రా. త్వరలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసి తన నియామక పత్రాలను అందజేయనున్నారు.వినయ్ మోహన్ గతంలో ఫ్రాన్స్, నేపాల్‌లలో భారత రాయబారిగా వ్యవహరించారు. ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు.ఈ ఏడాది జూలై 14న ఫారిన్ సర్వీస్ నుంచి వినయ్ మోహన్ పదవీ విరమణ చేశారు. కాగా, 1988 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఐఎఫ్‌ఎస్) అధికారి క్వాత్రా ఫ్రాన్స్, నేపాల్‌లోనూ భారత రాయబారిగా ఉన్నారు. ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు.
కాగా, గతంలో రాయబారిగా ఉన్న తరంజిత్ సింగ్ సంధు జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వినయ్‌ని నియమించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంచనా వేయడం, కొత్తగా కొలువుదీరబోయే ఫెడరల్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం క్వాత్రా ముందున్న పెద్ద పని.ఈ ఏడాది చివరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వస్తారని భావిస్తున్నారు.సిఖ్ ఫర్ జస్టిస్ నేత, ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇరుదేశాల మధ్య విభేదాలు, మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ సమావేశం, భారతదేశంలో మానవ హక్కుల స్ధితిపై అమెరికా వైఖరి తదితర అంశాలను వినయ్ క్వాత్రా చక్కబెట్టాల్సి ఉంది.
Read Also: Egg: ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?