తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్ మీకోసం..

తమిళ చిత్రసీమ సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత ఎంజీఆర్ తర్వాత ఇప్పుడు విజయ్‌కు దక్కింది. జయలలిత సినీ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ.. ఆమె ఎంజీఆర్ వారసురాలిగా కొనసాగారు. అయితే విజయ్ సొంతంగా పార్టీ పెట్టి, అతి తక్కువ కాలంలోనే ప్రధాన పార్టీలను ఢీకొట్టి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ స్టేడియానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రముఖుల మధ్య విజయ్ మరికొద్ది సేపట్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఆయన సహచరి నటి త్రిష కూడా నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.