Vijay Diwas : నేడు “విజయ్ దివస్” ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ , రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ నేతలు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
ఈరోజు, విజయ్ దివస్ ప్రత్యేక సందర్భంగా, భారతదేశం యొక్క సాయుధ బలగాల ధైర్యసాహసాలు మరియు త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తుంది. వారి అచంచలమైన ధైర్యం మరియు దేశభక్తి మన దేశం సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి త్యాగం మరియు సేవను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు అంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
నేడు విజయ్ దివస్. 1971 యుద్ధంలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, భారతదేశానికి విజయాన్ని అందించిన మన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నాను. ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కథలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తాయి..అంటూ రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు.
ఈ రోజు, విజయ్ దివస్ సందర్భంగా, 1971లో భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన వీర సైనికుల ధైర్యాన్ని మరియు త్యాగాలను మేము గౌరవిస్తాము. వారి నిస్వార్థ అంకితభావం మరియు అచంచలమైన సంకల్పం మన దేశాన్ని కాపాడింది మరియు మనకు కీర్తిని తెచ్చింది. ఈ రోజు వారి అసాధారణ పరాక్రమానికి నివాళి. మరియు వారి అచంచలమైన ఆత్మ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. మరియు మన దేశ చరిత్రలో లోతుగా పొందుపరచబడి ఉంటుంది. అని ప్రధాని మోడీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్మీ హెచ్‌క్యూ ఈస్టర్న్ కమాండ్ ఫోర్ట్ విలియమ్‌లోని విజయ్ స్మారక్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో కలిసి భారత సైన్యం, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పుష్పగుచ్ఛం ఉంచారు.
కాగా, నేడు దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం (1971 War) లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్ నడ్డివిరిచి పాక్ నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబర్ 16న “విజయ్ దివస్” ను నిర్వహిస్తుంది.
Read Also: Rajkapoor Songs : రాజ్‌కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్