BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ అపోలోలో చేరిక‌!

దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని స‌మాచారం.

Published By: HashtagU Telugu Desk
BJP Leader Lal Krishna Advani

BJP Leader Lal Krishna Advani

BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ పీఎం లాల్ కృష్ణ అద్వానీ (BJP Leader Lal Krishna Advani) ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. అర్థరాత్రి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. 97 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన ఎల్‌కే అద్వానీ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ముందు కూడా ఆయ‌న‌ జూలైలో ఆసుపత్రిలో చేరారు. అయితే అతను కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.

బులెటిన్ విడుదల కానుంది

ఎల్‌కె అద్వానీ ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ల బులెటిన్‌ను ఆసుపత్రి కొంత సమయంలో విడుదల చేయ‌నుంది. అద్వానీ పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోందని స‌న్నిహితులు చెబుతున్నారు. అంతకుముందు జులై 3న ఆయన అదే ఆసుపత్రిలో చేరారు. ఈ ఏడాది జూన్ 26న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స కూడా చేశారు. 97 ఏళ్ల సీనియర్ నాయకుడు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విష‌యం తెలిసిందే.

Also Read: CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌.. విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం!

దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని స‌మాచారం. ఇంతకు ముందు కూడా ఆయన ఈ ఏడాది జూలై నెలలో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి నిలకడగా మారడంతో డిశ్చార్జి చేశారు. సరిగ్గా దానికి నెల రోజుల ముందు అంటే జూన్ 26న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. యూరాలజీ విభాగంలో చికిత్స పొందారు. జూన్ 27 మధ్యాహ్నం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న కరాచీలో (ఇది నేటి పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. అద్వానీ 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేరడం ద్వారా వాలంటీర్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1986 నుంచి 1990 వరకు.. మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి అద్వానీ. అద్వానీ 1999 నుండి 2005 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిని చేసింది.

 

  Last Updated: 14 Dec 2024, 10:21 AM IST