Vehicles PUC Certificates : ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకులోకి ఎంటర్ అయ్యారో మీపై భారీ ఫైన్ పడుతుంది. గరిష్ఠంగా రూ.10వేల దాకా ఫైన్ కట్టాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.. ఈ కొత్త రూల్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతోంది. ఇంతకీ ఏమిటీ రూల్ ? ఎక్కడ అమల్లోకి రాబోతోంది ? వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మన దేశంలో అత్యంత కాలుష్యమయ నగరం ఢిల్లీ. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఢిల్లీలోని పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్ పోయించుకోవాలన్నా వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్(Vehicles PUC Certificates) తప్పనిసరిగా ఉండాలని డిసైడ్ చేసింది. ఒకవేళ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే భారీగా ఫైన్‌ను బాదుతారు. జరిమానా దాదాపు రూ.10వేల దాకా ఉంటుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం హస్తినలోని 100 పెట్రోల్ పంపుల్లో పొల్యూషన్ సర్టిఫికెట్ల చెకింగ్ కోసం కెమెరాలు, సాఫ్ట్‌వేర్‌ను అమర్చనుంది. ఈ దిశగా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెట్రోలు బంకుల్లో పొల్యూషన్ సర్టిఫికెట్ల తనిఖీ కోసం నవగతి టెక్ అనే ప్రైవేట్ కంపెనీకి ఢిల్లీ రవాణా శాఖ టెండర్లను కేటాయించింది. ఢిల్లీలోని అన్ని పెట్రోలు బంకుల్లో పొల్యూషన్ సర్టిఫికెట్ల చెకింగ్ వ్యవస్థ, కెమెరాలు, సాఫ్ట్‌వేర్‌ను అమర్చేందుకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెట్రోల్ బంకుకు వచ్చే వాహనాలకు పీయూసీ లేకపోతే, వెంటనే దాని పొల్యూషన్‌ను చెక్ చేస్తారు. ఆ వాహనంపై రూ. 10 వేల ఈ-చలాన్ విధిస్తారు. సదరు వాహన యజమాని మొబైల్ నంబర్‌కు ఈ-చలాన్‌ను ఢిల్లీ రవాణా శాఖ పంపించనుంది.
Also Read :KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్నిసార్లు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వరుస సెలవులు ప్రకటిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కంపెనీల ఉద్యోగాలను ఆదేశిస్తున్నారు. సరి-బేసి వాహనాలను నడిపే రూల్‌ను అమలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు భవన నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పుడు వాహనాల్లో పెట్రోలు, డీజిల్ పోయించుకోవడానికి పొల్యూషన్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేశారు.